ETV Bharat / bharat

ఇల్లంతా భార్య జ్ఞాపకాలు!- కూల్చకుండా ఏకంగా ఇంటినే తరలిస్తున్న భర్త! ఎక్కడంటే? - రూ 50 లక్షలతో ఇంటిని తరలించిన వ్యక్తి

Man Relocated His House : తన భార్య జ్ఞాపకాలకు గుర్తుగా ఉన్న మూడంతస్తుల ఇంటిని ఏకంగా వేరో చోటుకు తరలించేందుకు జమ్ములోని ఓ వ్యాపారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం హరియాణాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇంటిని తరలించడానికి కారణమేమిటంటే?

Man Relocated His House
Man Relocated His House
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 8:24 PM IST

Updated : Dec 7, 2023, 10:30 PM IST

భార్య జ్ఞాపకాలతో ఇల్లు- కూల్చకుండా ఏకంగా ఇంటినే తరలిస్తున్న భర్త! ఎక్కడంటే?

Man Relocated His House : జమ్ముకు చెందిన ఓ వ్యాపారి తన భార్య జ్ఞాపకాలను పదిలంగా ఉంచేందుకు అరుదైన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం తన ఇల్లు ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల ఏకంగా ఇంటినే వేరో చోటుకు తరలిస్తున్నారు. రూ. 50లక్షల వ్యయంతో హరియాణాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.

"ప్రశ్న : ఇంటిని తరలించాల్సిన అవసరమేంటి?

జవాబు : "ఈ ఇంటిని తరలించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. రెండోది తన భార్యకు జ్ఞాపకార్థం ఇల్లు కూల్చివేయడం యజమానికి ఇష్టం లేదు"

- ధూమ్​ సింగ్​, సూపర్​ వైజర్​

రోజుకు అలా..
ఇంటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఇనుప కడ్డీలు, హైడ్రాలిక్ జాక్​లను అమర్చారు. ఆ తర్వాత రోజుకు 2-3 అడుగుల మేరకు ఇంటిని ఎత్తుతూ మరో చోటుకు తరలిస్తారు.

"భవనాన్ని తరలించే ప్రాజెక్ట్​లో మొత్తం 20 మంది పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇంటిని ఎనిమిది అడుగురు పైకి ఎత్తారు. ట్రాక్​ల ద్వారా ఇంటిని తరలిస్తాం

ప్రశ్న: మీరు భవనాన్ని ఎంత దూరం తరలిస్తున్నారు?

జవాబు : 160 అడుగులు. తరలించడానికి సుమారు మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది"

- ధూమ్​ సింగ్​, సూపర్​ వైజర్​

దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి టెక్నాలిజీని ఉపయోగించినప్పటికీ జమ్ములో మాత్రం ఇదే తొలిసారి అని స్థానికులు తెలిపారు.

కొన్నాళ్ల క్రితం పంజాబ్​లో ఇలాంటి సంఘటన జరిగింది. రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభత్వం తన ఇంటిని కూల్చేస్తుందని తెలుసుకున్న వ్యక్తి ఏకంగా ఇంటినే 500 అడుగులు వెనక్కి జరిపించారు. తద్వారా కలల సౌధంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఆ ఇల్లు తన కలలకు ప్రతిరూపమని చెప్పారు. తనకు మరో ఇల్లు కట్టుకోవడం ఇష్టం లేదని అందువల్లే ఈ విధంగా చేశానని ఆ రైతు వెల్లడించారు. ఈయన కట్టుకున్న రెండంతస్తుల ఇల్లు సంగ్రూర్ పట్టణ సమీపంలోని రోషన్​వాలా గ్రామంలో ఉంది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : Dec 7, 2023, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.