ఛత్తీస్‌గఢ్.. గరియాబాంద్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం గుండెపోటుతో నిందితుడు మరణించాడు. శనివారం రాచార్ లాంగ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతురాలిని రత్నీబాయిగా గుర్తించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికే రత్నీబాయి మరణించింది. ఆమె పక్కనే ఆమె భర్త వీరేంద్ర అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. హుటాహుటిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. వీరేంద్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే భార్యను కొడవలితో గొంతు కోసి హతమార్చినట్లు స్థానికులు చెప్పారని పోలీసులు తెలిపారు.
ప్రియురాలి కుమారుడిని..
ఉత్తరాఖండ్.. హరిద్వార్‌లోని రూడ్కీలో దారుణం జరిగింది. ఓ వివాహిత.. కాసిఫ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవల ప్రియుడితో ఆమెకు గొడవ జరిగింది. వివాహితపై కోపం పెంచుకున్న కాసిఫ్.. ఆమె 12 ఏళ్ల కుమారుడిని హత్య చేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి బయట పడేశాడు. సీసీటీవీలో నిందితుడు సూట్‌కేసులో మృతదేహాన్ని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.