ETV Bharat / bharat

దిల్లీలో దారుణం.. యువతి తలపై రాడ్​తో కొట్టి హత్య.. పెళ్లికి నో చెప్పినందుకే! - దిల్లీలో యువతి తలపై రాడ్​తో కొట్టి హత్య

Man Kills Delhi College Student With Iron Rod : దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. పార్క్​లో బెంచ్‌పై కూర్చున్న యువతి తలపై ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా చంపాడు ఓ వ్యక్తి. బిహార్​లో జరిగిన మరో ఘటనలో 10 ఏళ్ల బాలికను గ్యాంగ్​ రేప్​ చేసి అతి దారుణంగా చంపారు దుండగులు. అనంతరం ఆమెను ఇంటి పునాది కింద 10 అడుగుల లోతులో పాతిపెట్టారు.

delhi student killed
delhi student killed
author img

By

Published : Jul 28, 2023, 4:27 PM IST

Updated : Jul 28, 2023, 5:15 PM IST

Delhi Student Killed : పట్టపగలే పార్కులో ఓ యువతిని దారుణంగా హత్య చేశాడు దుండగుడు. బెంచ్‌పై కూర్చున్న యువతి తలపై వెనక నుంచి ఇనుప రాడ్డుతో కొట్టి దారుణంగా చంపాడు. ఈ ఘటన దిల్లీ మాలవీయనగర్ శివాలిక్‌లోని విజయ్ మండల్ పార్క్‌లో జరిగింది. యువతిని ఇనుప రాడ్డుతో తలపై కొట్టిన అనంతరం.. యువకుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. యువకుడి దాడితో యువతి తల పగిలి ఆ ప్రాంతమంతా రక్తం పారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి సమీపంలో పడి ఉన్న ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది
నిందితుడు ఇర్ఫాన్ (28) డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఇర్ఫాన్​ బంధువైన యువతి(22) దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోంది. అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వేధించేవాడు ఇర్ఫాన్​. ఈ విషయం యువతి ఇంట్లో చెప్పగా.. ఉద్యోగం లేదన్న కారణంతో ఇర్ఫాన్​తో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన నిందితుడు.. పార్క్​లో కూర్చున్న యువతిని దారుణంగా రాడ్​తో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

  • Delhi | We received information that the body of a 25-year-old girl was found near Aurbindo College in South Delhi's Malviya Nagar. An iron rod was found near her body. According to a preliminary investigation, the girl was attacked with a rod. Further investigation is in… pic.twitter.com/eCOeVAd1yi

    — ANI (@ANI) July 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్వాతి మలివాల్​ విచారం
ఈ దారుణ హత్యపై దిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసులకు నోటీసులు జారీ చేశారు. దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని మలివాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

10ఏళ్ల బాలికను గ్యాంగ్​రేప్​.. 10 అడుగుల లోతులో పాతిపెట్టి..
10 ఏళ్ల బాలికను గ్యాంగ్​ రేప్​ చేసి అతి దారుణంగా చంపారు దుండగులు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఇంటి పునాది కింద 10 అడుగుల లోతులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన బిహార్​లోని బెగుసరాయ్​లో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇది జరిగింది
బఛ్​వారా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 10 ఏళ్ల బాలిక జులై 24న గోరింటాకు కోసం బయటకు వెళ్లింది. ఈ క్రమంలోనే బాలికను గమనించిన నిందితులు.. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను హత్య చేసి.. ఇంటి పునాది కింద 10 అడుగుల లోతులో పూడ్చిపెట్టారు.

మరోవైపు, బాలిక ఇంటికి రాకపోవడం వల్ల అందోళనకు గురైన తల్లిదండ్రులు అంతా గాలించారు. ఎక్కడా జాడ లభించకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. బాలికను తామే అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంటి యజమాని, సహాయకుడితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి : ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..

అప్పు తిరిగి ఇవ్వనందుకు అరాచకం.. భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

Last Updated : Jul 28, 2023, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.