ETV Bharat / bharat

Viral: విష సర్పానికి నోటితో ఆక్సిజన్​! - ఒడిశాలో పాముకు ఆక్సిజన్

ఊపిరాడని మనిషికి నోటితో ఆక్సిజన్​ అందించే సంఘటనలు అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే పాముకు నోటితో ప్రాణవాయువును అందించి, దాని ప్రాణాలను కాపాడారు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది.

Oxygen to snake through mouth
పాముకు నోటితో ఆక్సిజన్
author img

By

Published : May 29, 2021, 7:33 PM IST

పాముకు నోటితో ఆక్సిజన్ అందిస్తోన్న స్నేక్​ హెల్ప్​లైన్ సిబ్బంది

పామును చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. కొంత ధైర్యం చేసే వాళ్లు దాన్ని కర్రతో కొట్టేందుకే చూస్తారు. కానీ, ఓ వ్యక్తి ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ నాగుపాము(కోబ్రా)కు నోటితో ఆక్సిజన్​ అందించి రక్షించాడు. ఈ సంఘటన ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో జరిగింది.

నువాగూడ షాహీలో ఓ వ్యక్తి తన ఇంట్లోకి వచ్చిన పాము సమాచారాన్ని స్నేక్​ హెల్ప్​లైన్​కు అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. ఆ సర్పం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు గుర్తించారు. నడవలేని స్థితిలో సొమ్మసిల్లిపోయి ఉన్న కోబ్రాకు.. స్నేహాశీష్​ అనే హెల్ప్​లైన్ సభ్యుడు చిన్న పైపు సాయంతో నోటితో ఆక్సిజన్​ అందించాడు. ఆ పామును రక్షించాడు.

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సకాలంలో స్పందించి పాము ప్రాణాలు రక్షించిన.. స్నేహాశీష్​పై ప్రశంసలు కురుస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చూడండి: ఇంట్లో 8 పాము గుడ్లు.. ఇతడు ఏం చేశాడంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.