ప్రజలకు వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించేందుకు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి వినూత్న ప్రచారం చేపట్టాడు. ఆరుముగం అనే ఓ యువకుడు తన స్కూటర్‌పై వ్యాక్సిన్‌తో పాటు సిరంజీల నమూనాలను అమర్చి, రోడ్లపై ప్రయాణిస్తూ ప్రచారం చేస్తున్నాడు.
ప్రజల్లో వ్యాక్సిన్‌పై ఉన్న భయాన్ని, అపోహలను తొలగించి టీకా తీసుకునే దిశగా కృషి చేస్తానని ఆరుముగమ్ అంటున్నాడు. స్కూటర్‌పైనే జమ్ము కశ్మీర్‌కు చేరుకుని అక్కడి నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించనున్నట్లు తెలిపాడు. ప్రతి ఒక్కరూ టీకా రెండు డోసులను తప్పక తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇదీ చూడండి: ఎనిమిది రాష్ట్రాల్లో ఆందోళనకరంగా కరోనా ఆర్-ఫ్యాక్టర్!