Man harass woman punjab: ఆమెకు ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. వీడియోకాల్స్ చేసి యువతిని మాటల్లోకి దింపాడు. అలా ఆమె ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి బెదిరించాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని హెచ్చరించాడు. ఏం చేయాలో తెలియని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన దిల్లీలో జరిగింది.
ఏమైందంటే..?
పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన జస్మీత్ సింగ్(33)కు ఇన్‌స్టాలో ఓ యువతితో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో వీడియోకాల్స్ ద్వారా చాట్ చేస్తూ.. రహస్యంగా వీడియోలను రికార్డు చేశాడు. ఆ తర్వాత అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసునమోదు చేశారు పోలీసులు. నిందితుడ్ని అరెస్ట్ చేసి మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: పుట్టింటికి వెళ్లిందని భార్యపై ఆత్మాహుతి దాడి..