ETV Bharat / bharat

ఒకే వ్యక్తికి నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు

నిమిషాల వ్యవధిలోనే ఓ యువకుడికి కరోనా టీకా రెండు డోసులను (two doses of covishield) ఇచ్చారు వైద్య సిబ్బంది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది.

two doses of covishield vaccine
నిమిషాల వ్యవధిలో రెండు డోసులు!
author img

By

Published : Sep 3, 2021, 5:21 PM IST

కొవిడ్​ టీకా మొదటి డోసు తీసుకున్న ఓ యువకుడికి.. కొన్ని నిమిషాల్లోనే మరొకటి వేశారు (two doses of covishield) వైద్య సిబ్బంది. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం జరిగింది. యువకుడి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యాధికారులు చెప్పారు.

కూటేలు గ్రామానికి చెందిన కేబీ అరుణ్​.. టీకా తీసుకునేందుకు స్థానికంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్​ కేంద్రానికి వెళ్లాడు. అక్కడి సిబ్బంది అరుణ్​కు కొవిషీల్డ్​ తొలి డోసును ఇచ్చారు. టీకా తీసుకున్న అరుణ్​.. అక్కడే ఉన్న వెయిటింగ్​ రూమ్​లో కూర్చున్నాడు. అరుణ్​ను గుర్తించని అక్కడి సిబ్బంది అతనికి మరోసారి టీకా వేశారు. ఓ వ్యక్తికి రెండుసార్లు టీకా వేశామని తెలుసుకున్న సిబ్బంది.. అరుణ్​ను మూడు గంటల పాటు పర్యవేక్షించి ఇంటికి పంపించారు.

ఈ ఘటనపై అక్కడి వైద్యాధికారి డా. నందకుమార్​ స్పందించారు. అరుణ్​ మాస్క్​ ధరించడం వల్ల నర్స్ అతడిని గుర్తించలేకపోయిందని తెలిపారు. విదేశీ ప్రయాణానికి రెండు డోసులు అవసరం అయినందున.. ఒకేసారి రెండు డోసులు ఇస్తారేమో అన్న అభిప్రాయంతో అరుణ్​ ఉన్నాడని పేర్కొన్నారు. అరుణ్​ ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని.. ఇప్పటివరకు ఎలాంటి దుష్ప్రభావాలను గుర్తించలేదని నందకుమార్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : covid variant mu: భారత్​లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్​ ప్రమాదకరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.