గుజరాత్ పంచమహల్ జిల్లా జోట్వాడ్ గ్రామానికి చెందిన వర్సాంగ్ బారియా ఓ వింత ఫిర్యాదుతో పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. తనను చంపేందుకు దెయ్యాలు ప్రయత్నిస్తున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను పొలంలో పని చేస్తుండగా దెయ్యాలు కనిపించి తనతో మాట్లాడాయని.. ఆ సమయంలోనే తనను చంపేస్తాయని బెదిరించినట్లు బాధపడ్డాడు.

'మానసిక వ్యాధి వల్లే..'
అయితే.. వర్సంద్ మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అతని సోదరుడు సైతం ధ్రువీకరించాడు. సంవత్సర కాలంగా అతను ఈ వ్యాధితో బాధపడుతున్నాడని, చికిత్స సైతం తీసుకుంటున్నాడని వివరించాడు.

ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించగా.. వర్సాంగ్ బారియాకు మెరుగైన మానసిక చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: