ETV Bharat / bharat

మూడుపూటలు 'మ్యాగీ నూడిల్స్​'.. భార్యకు విడాకులిచ్చిన భర్త! - మ్యాగీ నూడిల్స్​ కేసు

ఇన్​స్టంట్​ నూడిల్స్​.. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది వినియోగిస్తున్న అల్పాహారం. అయితే, అవే నూడిల్స్​ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టాయి. విడాకులు తీసుకునేలా చేశాయి. అది ఎక్కడో కాదు మన దేశంలోనే. అదేలా అంటారా? ఈ కథనం చదవాల్సిందే.

Man divorces wife
మ్యాగీ నూడిల్స్​ విడాకులు
author img

By

Published : Jun 3, 2022, 3:56 PM IST

కుటుంబ కలహాలు, మనస్పర్థలు, పెద్ద పెద్ద గొడవలు తలెత్తటం వంటి కారణాలతో భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఓ భర్త తనకు మూడుపూటలా మ్యాగీ నూడిల్స్​ పెడుతోందన్న కారణంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ అరుదైన సంఘటన కర్ణాటకలోని బళ్లారిలో వెలుగు చూసింది. మరి ఈ నూడిల్స్​ కథేంటో తెలుసుకుందాం.

తన భార్యకు ఇన్​స్టంట్​ నూడిల్స్​ మినహా మరే వంటకం తయారు చేయటం తెలియదని, రోజులో మూడుపూటలు మ్యాగీనే వండి పెడుతోందని కొంతకాలం క్రితం కోర్టును ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ప్రతి రోజు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, డిన్నర్​లో నూడిల్స్​ మాత్రమే చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కిరాణ సరకుల కోసం షాపింగ్​కు వెళ్తే.. మ్యాగీ నూడిల్స్​ మాత్రమే కొనుగోలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు విడిపోయిన ఈ కేసు 'మ్యాగీ కేసు'గా ప్రాచుర్యం పొందింది.

రోజులో మూడుపూటలు మ్యాగీనే పెడుతోందని, విడాకులు ఇప్పించాలని దాఖలైన విడాకుల పిటిషన్​ను.. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్డ్​ జడ్జ్​ ఎంఎల్​ రఘునాథ్ గుర్తు చేసుకోవటం వల్ల వెలుగులోకి వచ్చింది. కొందరు చిన్న చిన్న కారణాలతోనే విడాకుల కోసం కోర్టు గుమ్మం ఎక్కుతున్నారని ఆయన అన్నారు. 'కొన్నేళ్లుగా విడాకుల కేసులు పెరిగాయి. విడాకులు కావాలనుకునే దంపతులు కనీసం ఏడాది పాటు కలిసి ఉండాలి. అలాంటి చట్టం లేకుంటే.. నేరుగా వివాహ మండపం నుంచే విడాకుల పిటిషన్లు దాఖలవుతాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణాల్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయి. గ్రామాల్లో ఊరి పెద్దలు కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తారు. అక్కడ మహిళలు స్వతంత్రంగా ఉండరు. సమాజం, కుటుంబ గౌరవం వంటి అంశాలు వారిని పరిస్థితులకు తగినట్లుగా నడుచుకునేలా చేస్తాయి. కానీ, నగరాల్లో మహిళలు విద్యావంతులు, ఆర్థికంగా స్వతంత్రులు అందుకే విడాకుల కేసులు ఎక్కువగా వస్తాయి. ' అని పేర్కొన్నారు.

చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకున్న సందర్భం ఇదే తొలిసారి కాదు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డిన్నర్​లో మటన్​ కూర చేయలేదని పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు.. తన భార్యను తొలిసారి మేకప్ ​లేకుండా చూసి విడాకులు తీసుకున్న సంఘటన యూఏఈలో జరిగింది.

ఇదీ చూడండి: నాలుగు చేతులు, కాళ్లతో చిన్నారి అవస్థ.. సాయానికి ముందుకొచ్చిన సోనూసూద్​

భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.