Man Created Garden Using Plastic Waste in Kerala : కేరళకు చెందిన ఓ వ్యక్తి.. ప్లాస్టిక్‌పై ఒంటరి పోరాటం చేస్తున్నారు. త్రిస్సూర్‌లో నివసించే చంద్రన్ అనే వ్యక్తి.. ప్లాస్టిక్ వ్యర్థాల్లో మొక్కలను పెంచుతూ అందమైన తోటను ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో అనర్థం జరుగుతుందని గ్రహించిన చంద్రన్.. దాని పరిష్కారం దిశగా ఆలోచించారు. ఈ క్రమంలోనే మొక్కలు పెంచడం ప్రారంభించారు.
గ్రామస్థుల సంకల్పం.. 15 రోజుల్లోనే ప్లాస్టిక్‌కు చెక్.. ఒకే ఒక్క నినాదంతో..
అయితే, ఈ మొక్కలను ప్లాస్టిక్ వ్యర్థాలతో చేసిన వస్తువుల్లో పెంచారు చంద్రన్. ఇందుకోసం రోడ్ల పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. వాటిని అందంగా పేర్చి.. మొక్కలను పెంచారు. గత ఏడేళ్లుగా ఈ తోటను పెంచుతున్నారాయన. దీనికి ఈడెన్ గార్డెన్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ గార్డెన్లో పెరిగిన మొక్కలను చూస్తుంటే ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతోందని అంటున్నారు చంద్రన్.
మానవాళికి ప్లాస్టిక్ భూతమే 'మరణ' శాసనం.. మగపిల్లల్లో వీర్య కణాల లోపం!.. కట్టడికి రాజమార్గమిదే..
"నాకు ప్రకృతి, పచ్చదనం అంటే చాలా ఇష్టం. గత ఏడేళ్లుగా ఈడెన్ గార్డెన్‌ను నిర్వహిస్తున్నాను. ఈ గార్డెన్లో ప్రధానంగా మూడు రకాల మొక్కలను నాటాను. ఈ మొక్కలన్నింటినీ నిరుపయోగమైన ప్లాస్టిక్ వస్తువులలోనే అమర్చాను."
-చంద్రన్, ఈడెన్ గార్డెన్ నిర్వహకుడు
తోడుగా భార్య..
ప్రస్తుతం చంద్రన్ ఇంటి ప్రాంగణమంతా.. మొక్కలు, పూల అందాలతో కళకళలాడుతోంది. చంద్రన్ ఆశయానికి ఆయన భార్య ఆశా కూడా చేయూతనందిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా నందనవనంలా మారిపోయింది. ప్రస్తుతం అది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్లాస్టిక్ కోరల్లో దేశం.. మరి పోరాటం ఎప్పుడు?
"ఈడెన్ గార్డెన్ నిర్వహణ నా భర్త చూసుకుంటారు. నా ఇంటి పని పూర్తయ్యాక నేను కూడా తోట పనిలో మమేకమవుతాను. నా భర్తకు పూల మొక్కల కంటే పచ్చని చెట్లంటే చాలా ఇష్టం."
-ఆశా, చంద్రన్ భార్య
ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలనే మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతున్న చంద్రన్, ఆశా దంపతులు.. చుట్టుపక్కల వారికే కాకుండా జిల్లా ప్రజలకూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్
శిలాజ ఇంధనాలతో డీజిల్ తయారు చేయడం మనం చూసుంటాం. కానీ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ ఎలా తయారు చేస్తారో తెలుసా? దీన్ని నిజం చేసి చూపిస్తున్నారు కొందరు యువకులు. ఇంజినీరింగ్‌లో రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించిన వీరు.. పర్యావరణ పరిరక్షణ కోసం స్వదేశానికి తిరిగి వచ్చి ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ తయారు చేసే పరిశ్రమను స్థాపించారు. వారి కథేంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసేయండి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు... కేంద్రానికి రిలయన్స్ ఆఫర్