ETV Bharat / bharat

'పెళ్లి చేయండి.. లేకపోతే టవర్​పై నుంచి దూకేస్తా...' - హరియాణాలో టవర్​ ఎక్కిన యువకుడు

మద్యం మత్తులో టవర్​ ఎక్కాడు ఓ యువకుడు. పెళ్లి చేయకపోతే టవర్​పై నుంచి దూకేస్తానని కుటుంబ సభ్యులను బెదిరించాడు. చాలా గంటల హైడ్రామా తరువాత ఆ యువకుడ్ని కిందకు దించారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

man-climbed-on-mobile-tower-to-demand-marriage-in-karnal
పెళ్లి చేయండి.. లేకపోతే టవర్​ నుంచి దూకేస్తా...
author img

By

Published : Nov 14, 2021, 10:50 PM IST

Updated : Nov 15, 2021, 11:14 AM IST

పెళ్లి చేయండి.. లేకపోతే టవర్​ నుంచి దూకేస్తా...

తనకు పెళ్లి చేయాలంటూ హరియాణా కర్నాల్​​లో ఓ యువకుడు సెల్​ టవర్​ ఎక్కి నానా వీరంగం చేశాడు. వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే కిందకు దూకి చచ్చిపోతానని ఇంట్లో వారిని బెదిరించాడు. ఈ డ్రామా సుమారు రెండు గంటల పాటు నడిచింది. దీంతో స్థానికులు గుమిగూడారు. యువకుడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అందుకు అతడు ససేమీరా అన్నాడు. చివరకు యువకుడు కోరినట్లు పెళ్లి చేస్తానని కుటుంబసభ్యులు హామీ ఇచ్చారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పైన ఉన్న వ్యక్తిని స్నేహితుల సాయంతో కిందకు దించారు.

మద్యం మత్తులో రచ్చ..

గత శుక్రవారం కూడా టవర్​ ఎక్కడానికి ఆ యువకుడు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పుడు యువకుడి స్నేహితులు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. తన కొడుకు మద్యానికి బానిసై టవర్​ ఎక్కినట్లు తల్లి తెలిపారు. రోజూ తాగి వచ్చి తనతో గొడవ పెట్టుకుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై.. ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మేసినట్లు చెప్పుకొచ్చారు. ఏ పని చేయకుండా నిత్యం మద్యం సేవించే వాడికి ఎలా పెళ్లి చేయాలని ఆమె వాపోయారు.

ఇదీ చూడండి: ఎద్దు ధర రూ.కోటి.. గొర్రె విలువ రూ.10లక్షలు.. ప్రత్యేకతలు ఇవే...

Last Updated : Nov 15, 2021, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.