ETV Bharat / bharat

క్లాస్​ రూంలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. వారి ముందే మూత్ర విసర్జన! - delhi police

తరగతి గదిలోనే విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ కీచకుడు! వారి ముందే మూత్ర విసర్జన చేశాడు!! దిల్లీలోని ఓ మున్సిపల్ పాఠశాలలో జరిగిన ఈ దారుణ ఘటనను దిల్లీ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్​కు నోటీసులు జారీ చేసింది.

delhi school news
sexual assault on students in classroom
author img

By

Published : May 5, 2022, 6:22 AM IST

తూర్పు దిల్లీలోని ఓ మున్సిపల్ పాఠశాలలో ఇటీవల ఇద్దరు విద్యార్ధినులపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పట్ల దిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. తరగతి గదిలోకి ప్రవేశించి బాలికలపై వేధింపులకు దిగడమే కాకుండా.. వారి ముందే మూత్ర విసర్జన చేయడం సహించరానిదని మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్, తరగతి టీచర్​ దృష్టికి విద్యార్థినులు తీసుకెళ్లగా.. మౌనంగా ఉండాలంటూ వారు చెప్పడం ఆక్షేపణీయమని డీసీడబ్ల్యూ పేర్కొంది.

దీనిపై పోలీసులు, తూర్పూ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​కు (ఈడీఎంసీ) నోటీసులు జారీ చేసింది. నిందితుడిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.
భజన్​పురాలోని అయిదో తరగతి వరకు నిర్వహించే మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థినులు ఇచ్చిన వివరాల ప్రకారం నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 30న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: మైనర్​పై​ అత్యాచారం.. పోలీసు స్టేషన్​ గదిలోకి తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.