ETV Bharat / bharat

అక్కా అని పిలిచి అర్ధరాత్రి 'ఆమె'పై మృగాడి దాడి.. రెండు కళ్లు పొడిచేసి.. - transgender murdered in coimbatore

ఒంటరిగా ఉన్న మహిళను అర్ధరాత్రి వేధించి, ఆమె ప్రతిఘటించిందని రెండు కళ్లు పొడిచేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన బిహార్​లోని కటిహార్​లో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

attack on woman
అక్కా అని పిలిచి అర్ధరాత్రి 'ఆమె'పై దాడి.. రెండు కళ్లు పొడిచేసి..
author img

By

Published : Jul 13, 2022, 6:56 PM IST

బిహార్​ కటిహార్​లో ఓ మహిళ రెండు కళ్లు పొడిచేశాడు ఓ కిరాతకుడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి, అతడు అడిగినట్లు చేయలేదని ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టాడు. కళ్ల నుంచి తీవ్రంగా రక్తస్రావమై నరకం అనుభవించిన ఆ మహిళ.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

బాధిత మహిళ తన భర్త, పిల్లలతో కలిసి కటిహార్ జిల్లా అమ్దాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం భర్త ఊరెళ్లాడు. బాధితురాలి 8 ఏళ్ల కుమార్తె చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు అదే గ్రామానికి చెందిన మహ్మద్​ షమీమ్​(45) వారి ఇంటికి వచ్చాడు. అక్కా, అక్కా అంటూ తలుపు కొట్టాడు. బయటకు వెళ్లిన ఆ మహిళ.. ఏం కావాలని అడిగింది. కాసేపు ఇక్కడే ఉండు.. నీతో మాట్లాడాలి అని షమీమ్​ అన్నాడు. తనతో కలిసి దగ్గర్లోని డ్యామ్ దగ్గరకు రావాలని కోరాడు. ఇందుకు నిరాకరించిన ఆ మహిళ.. లోపలకు వెళ్లి తలుపు మూసేయబోయింది. ఇంతలోనే అతడు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఇంటి దగ్గర్లోని పొలంలోకి లాక్కెళ్లాడు. ఆమె రెండు చేతులు కట్టేశాడు. అక్కడ ఉన్న పుల్లలతో మహిళ రెండు కళ్లల్లో పొడిచాడు. కళ్ల నుంచి రక్తస్రావమై ఆమె విలవిల్లాడిపోయింది.

బాధితురాలి కుమార్తె.. ఇతర కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చింది. వారంతా వచ్చి ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయినా.. గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. వారి సిఫార్సు మేరకు వైద్య కళాశాల ఆస్పత్రిలో ఆమెకు చికిత్స చేయిస్తున్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు షమీమ్​ను అరెస్టు చేశారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. పాత పగల కారణంగానే ఇలా చేసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు కటిహార్ ఎస్​పీ జితేంద్ర కుమార్ తెలిపారు.

ట్రాన్స్​జెండర్లతో గొడవ.. ఒకరు మృతి
మరోవైపు.. తమిళనాడులో ట్రాన్స్​జెండర్లతో గొడవ పడి, తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మలింగం(49) కోయంబత్తూరులోని డుడియాలూర్​లో ఓ హోటల్​లో పనిచేసేవాడు. జులై 8 రాత్రి స్నేహితుడు ప్రవీణ్​తో కలిసి మెట్టుపాళ్యం రోడ్​కు వెళ్లాడు. అక్కడ సెక్స్ వర్కర్​గా చేస్తున్న రష్మిక అనే ట్రాన్స్​జెండర్​ను కలిశాడు. వారిద్దరి మధ్య కాసేపటికి గొడవ జరిగింది. రష్మిక దగ్గర్లో ఉన్న తన స్నేహితుల్ని పిలిచింది. ఐదుగురు ట్రాన్స్​జెండర్లు కలిసి ధర్మలింగం, ప్రవీణ్​పై దాడి చేశారు. ప్రవీణ్ పారిపోగా.. ధర్మలింగం తీవ్రంగా గాయపడ్డాడు.

చివరకు ధర్మలింగం ఓ ఆస్పత్రికి వెళ్లాడు. బైక్​పై వెళ్తుంటే పడ్డానని, గాయాలకు చికిత్స చేయాలని డాక్టర్​ను కోరాడు. అయితే.. వైద్యుడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి విచారించగా ధర్మలింగం అసలు విషయం చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ధర్మలింగం మంగళవారం ప్రాణాలు విడిచాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.