కర్ణాటకలోని కోలార్‌లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే.?
కోలార్ జిల్లా ముళబగలు తాలుకాలోని వెగామడుగు గ్రామంలో మే 7న ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను(సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. అయితే.. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. ఆ ఇద్దరిలో చెల్లి లలితకు ఇంకా వివాహ వయసు(18 ఏళ్లు) నిండలేదనే విషయం పోలీసులకు తెలిసింది.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న నంగళి ఠాణా పోలీసులు.. మైనర్‌ను వివాహమాడిన ఉమాపతిని అరెస్ట్ చేశారు. ఈ పెళ్లితో సంబంధమున్న మరో ఏడుగురిపైనా అభియోగాలు మోపారు.
ఇదీ చదవండి: శిర్డీ సాయిబాబా పేరిట ఆన్లైన్ మోసాలు