ETV Bharat / bharat

వీల్​ఛైర్​లోనే మమత ఎన్నికల ప్రచారం! - Mamata banerjee injuries

కాలి గాయంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన బంగాల్​ సీఎం మమతా బెనర్జీ.. వీల్​ ఛైర్​లోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు దీదీ తెలిపారు.

Mamata to hit campaign trail on wheelchair from Monday
బంగాల్​ బరి: వీల్​చైర్​లోనే మమత ఎన్నికల ప్రచారం!
author img

By

Published : Mar 14, 2021, 5:52 AM IST

Updated : Mar 14, 2021, 6:23 AM IST

వీల్​ఛైర్​లోనే ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా పురులియా జిల్లాలో పర్యటించనున్న దీదీ.. ఝల్దా సహా బలరాంపుర్​ రత్తాలా ప్రాంతాల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

అంతకుముందు ప్రచార షెడ్యూల్​ ప్రకారం.. బంకురా, ఝర్గాం జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే హెలికాఫ్టర్​ ద్వారా అన్ని జిల్లాలకు మమత వెళతారని.. కాలి గాయం కారణంగా వీల్​ఛైర్​లోనే కూర్చొని దీదీ ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

ఈ నెల 10న నందిగ్రామ్​ ప్రచారంలో మమత కాలికి గాయమైంది. దీంతో ఎస్​ఎస్​కేఎమ్ ఆసుపత్రికి చేరిన దీదీకి.. రెండు రోజులు చికిత్స అందించారు వైద్యులు. శుక్రవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు.

ఇదీ చూడండి: 'భాజపాకు ఓటేయకండి'- నందిగ్రామ్​లో టికాయత్​

Last Updated : Mar 14, 2021, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.