బంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణం చేయనున్నారు. కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో రాజ్భవన్లో ఉదయం 10.45 గంటలకు నిరాడంబరంగా కార్యక్రమాన్ని ముగించనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ సహా కొందరు నేతలకే ఆహ్వానాలు పంపించారు. మమత మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వంటి కొద్దిమంది సమక్షంలో ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారు.
బంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలుకు గానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అందులో తృణమూల్ కాంగ్రెస్ 213సీట్లు, భాజపా 77 సీట్లు, ఇతరులు 2సీట్లు గెలుచుకున్నారు. అయితే, మమతా బెనర్జీ తన స్థానంలో ఓటమి చవిచూశారు.
ఇదీ చదవండి: 'నందిగ్రామ్ గురించి చింతించొద్దు.. తీర్పు ఏదైనా ఓకే'