ETV Bharat / bharat

'బంగాల్​లో పౌర చట్టాన్ని అమలు చేస్తాం' - బంగాల్​ పర్యటనలో షా

బంగాల్​లో పౌరసత్వ సవరణ చట్టం కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఆ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

Amit shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా
author img

By

Published : Nov 6, 2020, 9:56 PM IST

బంగాల్​లో పౌరసత్వ సవరణ చట్టం తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అది కేంద్రం నిబద్ధతగా పేర్కొన్నారు. రాజకీయ హత్యలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల వివరాలను జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్​సీఆర్​బీ)కి ఎందుకు పంపటం లేదో ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

బంగాల్​ పర్యటనలో భాగంగా కోల్​కతాలో నిర్వహించిన మీడియా సమావేశంలో​ సీఎం మమతపై విమర్శలు గుప్పించారు షా.

" కొత్త తరం అభివృద్ధితో బలమైన బంగాల్​ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, మమతా బెనర్జీ తన మేనల్లుడిని తదుపరి ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. 2018 నుంచి బంగాల్​ ప్రభుత్వం నేర వివరాలను ఎన్​సీఆర్​బీకి పంపటం లేదు. రాజకీయ హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మమతా బెనర్జీని కోరుతున్నా. ఈ నేరాల్లో బంగాల్​ తొలిస్థానంలో ఉంది. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

బంగాల్​లో మమతా ప్రభుత్వం మూడు చట్టాలు అమలుచేస్తోందని ఆరోపించారు షా. ఒకటి.. సీఎం మేనల్లుడి కోసం, ఒకటి మైనారిటీల బుజ్జగింపుల కోసం, మరొకటి సామాన్య ప్రజల కోసం అని ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్​ మధ్య తలెత్తిన వివాదంపై మాట్లాడిన ఆయన.. గవర్నర్​ తనకు ఉన్న రాజ్యాంగ అధికారాల పరిధిలోనే విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కావన్నారు.

ఇదీ చూడండి: 'వారి రాజకీయాలతో బంగాల్​ వైభవానికి విఘాతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.