ETV Bharat / bharat

బంగాల్​లో 'మా' క్యాంటీన్- రూ.5కే భోజనం - West Bengal Chief Minister Mamata Banerjee

బంగాల్​లో ఓటర్లను ఆకర్షించేందుకు మరో పథకాన్ని తీసుకొచ్చింది దీదీ సర్కార్​. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో 'మా' క్యాంటీన్​లను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్యాంటీన్​లో ఐదు రూపాయలకే ప్లేట్​ భోజనం లభిస్తుందని ఆమె తెలిపారు.

Mamata launches scheme to provide meal at Rs 5 to poor people
మా క్యాంటీన్​లో రూ.5కే భోజనం
author img

By

Published : Feb 15, 2021, 6:19 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఓటర్లను ఆకర్షించేందుకు మరో అడుగు ముందుకేసింది అధికార తృణమూల్​ కాంగ్రెస్ ప్రభుత్వం​. పేద ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించే 'మా' పథకాన్ని సోమవారం వర్చువల్​గా ప్రారంభించారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. ఈ పథకం కింద కేవలం రూ.5కే ప్లేట్​ భోజనం అందిస్తామని ఆమె తెలిపారు.

'మా' పథకం ద్వారా అందించే భోజనంలో.. అన్నం, పప్పు, ఒక రకం కూరగాయతో పాటు.. గుడ్డు కూర కూడా ఉంటుందని దీదీ తెలిపారు. ఒక ప్లేట్​పై రూ.15 సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. స్వయం సహాయక బృందాలు నిర్వహించే ఈ క్యాంటీన్​లను క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

ఇదీ చదవండి: 'మీరు రోడ్డేస్తేనే.. మేము ఓటేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.