ఎల్‌పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ సిలిగురిలో పాదయాత్ర చేశారు. డార్జిలింగ్ మోర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వందలాది మంది కార్యకర్తల నడుమ మమత పాదయాత్ర చేశారు. ఎల్‌పీజీ సిలిండర్‌ను పోలిన ఎర్రటి ప్లకార్డులలతో పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్రలో దీదీతో పాటు తృణమూల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య, ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ పాల్గొన్నారు.
ఇంకొద్ది రోజుల్లో ఎల్‌పీజీని సామాన్యులకు దూరం చేస్తారంటూ పాదయాత్ర అనంతరం జరిగిన బహిరంగ సభలో మోదీ సర్కార్‌పై దీదీ మండిపడ్డారు.
"మీతో ఆటకు నేను సిద్ధం. ఒక వేళ భాజపా ఓట్లు కొనాలునుకుంటే.. వారి దగ్గర డబ్బులు తీసుకొని, టీఎంసీకి ఓటెయ్యండి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ ఎందుకు చేయలేదg. ప్రధాని అన్నీ అసత్యపు హామీలు ఇస్తున్నారు. ఎల్‌పీజీ ధరలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. మోదీ బంగ్లాలో ఉపన్యాసం ఇస్తారు కానీ.. స్క్రిప్ట్ మాత్రం గుజరాతీలో ఉంటుంది."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
'బంగాల్లో మహిళలు సేఫ్'
బంగాల్లో మహిళలకు భద్రత లేదన్న ప్రధాని వ్యాఖ్యలను మమత ఖండించారు. యూపీ, బిహార్‌ల కంటే బంగాల్లో మహిళలు సురక్షితంగా ఉన్నారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సానికి ఒకరోజు ముందు జరిగిన ఈ పాదయాత్రలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని తమ సంఘీభావం తెలిపారని భట్టాచార్య అన్నారు.
ఇదీ చదవండి : దీదీ.. మీరు మారిపోయారు, ముందులా లేరు: మోదీ