ETV Bharat / bharat

బంగాల్​ దంగల్: నడ్డా, దీదీ మాటల యుద్ధం - West Midnapore district Nadda

బంగాల్​లో అధికార టీఎంసీ, భాజపా మధ్య మాటల యుద్ధం ఉద్ధృతంగా సాగుతోంది. సీఎం మమతా బెనర్జీ లక్ష్యంగా.. భాజపా అధినేత నడ్డా విమర్శల పర్వం కొనసాగించారు. భాజపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మరోవైపు, భాజపా రథయాత్ర ప్రజలను విభజించడానికేనని మమత ఆరోపించారు. తామే దేవుళ్లని భావించి రథాలపై ప్రయాణిస్తున్నారని ధ్వజమెత్తారు.

bjp tmc
భాజపాXటీఎంసీ
author img

By

Published : Feb 10, 2021, 3:33 PM IST

బంగాల్​లోని రైతులు, గిరిజనుల సంక్షేమానికి మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. మా, మాటి, మనుష్(అమ్మ, నేల, ప్రజలు) అన్న నినాదంతో గెలిచినవారే ఇప్పుడు నియంతృత్వం, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగితేలుతున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ మెదినీపుర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి హాజరైన నడ్డా.. భాజపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో పేదలకు జరుగుతున్న అన్యాయం ఎక్కువ కాలం సాగదని.. వచ్చే ఎన్నికల్లో మమత ప్రభుత్వం దిగిపోయి, కమలం వికసించక తప్పదని జోస్యం చెప్పారు నడ్డా. ఆయుష్మాన్ భారత్ పథక ప్రయోజనాలను, పీఎం-కిసాన్ ద్వారా అందే సాయాన్ని రాష్ట్ర ప్రజలు కోల్పోయారని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని ప్రజలకు అందేలా చూస్తామని చెప్పారు.

"ఓవైపు బంగాల్ అభివృద్ధిని కాంక్షించే మోదీ ఉంటే, అన్ని అభివృద్ధి పనులను అడ్డుకొనే మమతా బెనర్జీ మరోవైపు ఉన్నారు. రాష్ట్రానికి మోదీ సర్కార్ అనేక ప్రాజెక్టులను ప్రకటించింది. రూ.4,700 కోట్ల విలువైన సహజ వాయు ప్రాజెక్టు సహా, రహదారులను మోదీ ఇటీవలే జాతికి అంకితమిచ్చారు. బంగాల్​లో రహదారుల నిర్మాణం, ఆధునికీకరణ కోసం రూ. 25 వేల కోట్లను కేంద్ర బడ్జెట్​లో కేటాయించారు. బంగాల్​లో అన్ని వర్గాల అభివృద్ధి జరిగేలా చూస్తాం."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ఈ కార్యక్రమంలో భాజపా బంగాల్ అధ్యక్షుడు, స్థానిక ఎంపీ దిలీప్ ఘోష్, మరో పార్టీ ఎంపీ సుకాంత మజుందార్ పాల్గొన్నారు.

విభజించేందుకే రథయాత్ర: దీదీ

మరోవైపు, రథయాత్ర పేరుతో ప్రజలను విభజిస్తున్నారని భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. భాజపా నేతలు తామే దేవుళ్లు అనుకొని రథాలపై ఊరేగుతున్నారని మండిపడ్డారు. సమాజాన్ని మత ప్రాతిపాదికన విభజించడమే ఈ యాత్ర వెనుక ఉన్న రాజకీయ అజెండా అని ఆరోపించారు. హిందుత్వం గురించి భాజపా అన్నీ అబద్ధాలే చెబుతోందని అన్నారు.

"రథయాత్ర అనేది మతపరమైన ఉత్సవం. ఇందులో మనమంతా పాల్గొంటాం. జగన్నాథస్వామి, బలరాముడు, సుభద్రదేవి వంటివారు రథాల్లో ప్రయాణించడం గురించి మనకు తెలుసు. కానీ భాజపా నేతలు మాత్రం రథయాత్రను తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సమాజాన్ని విభజించి, ఘర్షణలు సృష్టిస్తున్నారు. భాజపా నేతలే దేవుళ్లలా రథాలపై ప్రయాణిస్తున్నారు."

-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం

ప్రచారానికి వస్తున్న నేతలను బయటి వ్యక్తులుగా అభివర్ణించారు మమతా. విలాసవంతమైన కార్లలో వచ్చి ఫొటోల కోసమే స్థానికుల ఇళ్లలో భోజనాలు చేస్తున్నారని అన్నారు. ఫైవ్-స్టార్ హోటల్ నుంచి తెప్పించుకున్న ఆహారాన్నే గ్రామస్థుల ఇళ్లలో తింటున్నారని ఆరోపించారు. బంగాల్​ను బంగాల్ ప్రజలే పాలించుకుంటారని, గుజరాత్​ నుంచి వచ్చినవారు కాదని పునరుద్ఘాటించారు మమత.

ఇదీ చదవండి: పెట్రో ధరలు పెరిగింది 60 రోజులే: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.