బంగాల్లో 180 సీట్లకుగాను ఐదు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 122 కంటే ఎక్కవ సీట్లను భాజపా గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పూర్వవర్ధమాన్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నందిగ్రామ్‌లో ఓటమి తర్వాత టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిష్క్రమించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
"ఐదు విడతల్లో జరిగిన పోలింగ్ తర్వాత మమతా బెనర్జీ తన ఆశలన్నీ వదులుకున్నట్లు కనిపిస్తున్నారు. 122 కంటే ఎక్కువ సీట్లలో భాజపా గెలుస్తుంది. నందిగ్రామ్‌లో భాజపా అభ్యర్థి సువేందు అధికారే గెలుస్తారు."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి.
గొప్ప ఓటమితో మమతా బెనర్జీకి వీడ్కోలు దొరుకుతుందని అమిత్ షా విమర్శించారు. మమత పాలనలో దేశ పౌరులకు దక్కే ప్రయోజనాలను అక్రమ వలసదారులు పొందుతున్నారని ఆరోపించారు. 'బంగాల్ ప్రజలు, నేను.. మమతా బెనర్జీకి రెండో స్థాయి వ్యక్తులం' అని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: బంగాల్లో రాహుల్ ర్యాలీలు రద్దు
ఇదీ చూడండి: 'చొరబాట్లను ఆపడం భాజపాతోనే సాధ్యం'