ETV Bharat / bharat

మోదీ మీటింగ్​లో దీదీ తీరుపై కేంద్రం గుస్సా

బంగాల్​లో ప్రధాని నిర్వహించిన తుపాను సమీక్ష సమావేశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. మమతా బెనర్జీ సమావేశం నుంచి వెళ్లేందుకు ప్రధాని అనుమతి ఇవ్వలేదని తెలిపాయి. ప్రధాని నిష్క్రమించడానికి ముందే సమావేశం నుంచి వెళ్లిపోయి ప్రోటోకాల్స్​ను దీదీ ఉల్లంఘించారని పేర్కొన్నాయి.

Mamata defied protocol, misleading on controversy over chief secretary: GoI sources
మోదీ మీటింగ్​లో దీదీ తీరుపై కేంద్రం సీరియస్!
author img

By

Published : Jun 1, 2021, 3:39 PM IST

బంగాల్​లో తుపాను ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్​ను ఉల్లంఘించారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు మమతా బెనర్జీకి ప్రధాని అనుమతి ఇవ్వలేదని వెల్లడించాయి.

సువేందు వల్లే..

మోదీ సమావేశానికి హాజరయ్యేందుకు మమత తొలుత అంగీకరించారని, విపక్ష నేత సువేందు అధికారి వస్తున్నారని తెలియగానే నిర్ణయం మార్చుకున్నారని పేర్కొన్నాయి. విపక్ష నేత కూడా ప్రజలు ఎన్నుకున్న వ్యక్తే అని, గతంలో భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ప్రతినిధులతో సమావేశాలు జరిగాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి- మోదీ X దీదీ: సీఎస్​ విషయంలో మమత సూపర్ స్కెచ్!

"ప్రధాని వెళ్లిపోవడానికి ముందే ఆమె వెళ్లిపోయారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ప్రధాని మోదీని 20 నిమిషాల పాటు వేచి ఉండేలా చేసినట్లు మమతా బెనర్జీ ఇచ్చిన ప్రకటన తప్పు. మమతా రావడానికి ముందే కలైకుండలో ప్రధాని ల్యాండ్ అయ్యారు. ఒడిశా, బంగాల్ రాష్ట్రాలకు ప్రధాని పర్యటన గురించి ఒకే సమయంలో చెప్పాం. ఒడిశా ఈ కార్యక్రమాన్ని బాగానే నిర్వహించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమస్య సృష్టించలేదు."

-కేంద్ర ప్రభుత్వ వర్గాలు

ఇదీ చదవండి- మోదీ- దీదీ 'భేటీ'పై వివాదం

సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్ వివాదంపైనా మమత తప్పుదోవ పట్టిస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆలాపన్​ను రిలీవ్ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు పూర్తిగా రాజ్యాంగానికి లోబడే ఉన్నాయని తెలిపాయి. ఆల్ ఇండియా సర్వీస్​లో ఉన్న వారు రాజకీయాల్లో భాగం కాకూడదని అన్నాయి.

"రాజ్యాంగ విధులను ఆయన(ఆలాపన్) నిర్లక్ష్యం చేశారు. అందుకే ప్రధానికి ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వలేదు. మోదీ సమీక్ష సమావేశానికి బంగాల్ అధికారులెవరూ హాజరుకాలేదు. సీఎస్ రిటైర్మెంట్​ను గమనిస్తే దీని వెనక మమతా బెనర్జీ ఉన్నట్లు అర్థమవుతోంది. పరిణామాలు సీఎస్​కు వ్యతిరేకంగా ఉన్నాయని ఆమెకు తెలుసు. సీఎస్​గా కొనసాగించాలని కోరడం నుంచి.. ఇప్పుడు రిటైర్మెంట్ వరకు గంటల వ్యవధిలోనే మమతా బెనర్జీ ఈ విషయంలో మాట మార్చారు."

-కేంద్ర ప్రభుత్వ వర్గాలు

మరోవైపు, మాజీ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్​కు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఈ నోటీసులు పంపింది. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మోదీ సమావేశం సందర్భంగా మమతా బెనర్జీ రాష్ట్రంలో పర్యటించి తుపాను సమీక్ష చేపట్టారు. ప్రధాని మీటింగ్​కు 30 నిమిషాలు ఆలస్యంగా వచ్చి.. తుపాను నష్టంపై నివేదిక అందజేశారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. ప్రధాని ముందస్తు అనుమతితోనే వెళ్లినట్లు దీదీ వెల్లడించారు.

ఇదీ చదవండి- సైక్లోన్​ యాస్​: 'బంగాల్​లో కోటి మందిపై ప్రభావం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.