ETV Bharat / bharat

ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే

Prasant Kishore
ప్రశాంత్ కిశోర్​
author img

By

Published : May 2, 2021, 3:43 PM IST

Updated : May 2, 2021, 5:03 PM IST

14:49 May 02

ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇక రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టబోనని తెలిపారు. బంగాల్​లో టీఎంసీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. ఎన్నికల సంఘం భాజపాకు సహకరించిందని ఓ టీవీ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు.

"ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఎన్నికల్లో అన్ని విధాలా భాజపాకు సహాయం చేసింది. నిబంధనలు పక్కనపెట్టి.. భాజపాకు కొమ్ముకాసింది. ఓ రకంగా భాజపాకు ఈసీ అనుబంధ సంస్థలా వ్యవహరించింది." అని పేర్కొన్నారు ప్రశాంత్.

శక్తిమంతమైన పార్టీగా భాజపా..

బంగాల్​లో భాజపా నేతలు భారీగా ప్రచార ర్యాలీలు చేపట్టినప్పటికీ.. టీఎంసీ గెలుస్తుందని ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కిశోర్​ చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలో భాజపా శక్తిమంతమైన పార్టీగా మారిందన్నారు. "ఫలితాలు ఒకపక్కే ఉండొచ్చు. కానీ గట్టి పోటీ ఉంటుంది. భాజపా శక్తిమంతమైన పార్టీగా మారుతుంది" అని పేర్కొన్నారు.  

Last Updated : May 2, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.