ETV Bharat / bharat

మమతా బెనర్జీతో సోషలిజం పెళ్లి..

author img

By

Published : Jun 11, 2021, 7:18 AM IST

Updated : Jun 11, 2021, 11:35 AM IST

అదో పెళ్లి శుభలేఖ. అందులో వరుడి పేరు ఏఎం సోషలిజం.. వధువు పేరేమో పి.మమతా బెనర్జీ, వరుడి సోదరుల పేర్లు ఏఎం కమ్యూనిజం, ఏఎం లెనినిజం. ఇలాంటి విభిన్నమైన పేర్లతో ఉన్న ఆ పెళ్లిపత్రిక నెట్టింట వైరల్​గా మారింది. ఇది నిజమేనా? లేదా ఎవరైనా కావాలనే అలా సృష్టించారా అని నెటిజన్లలో తెగ చర్చ మొదలైంది. అయితే ఇది నిజమేనని వరుడి తండ్రి లెనిన్‌ మోహన్‌ తేల్చారు.

mamata benarjee weds am socailism
వైరల్​ పెళ్లి శుభలేఖ

తమిళనాడుకు చెందిన ఓ యువ జంట పెళ్లి శుభలేఖ తాజాగా నెట్టింట సంచలనంగా మారింది. వధూవరుల పేర్లు పి.మమతా బెనర్జీ, ఏఎం సోషలిజం కావడమే అందుకు కారణం. అయితే ఈ శుభలేఖ నిజమైందేనా లేదా ఎవరైనా అలా సృష్టించారా..? అనే అంశంపై నెటిజన్లలో చర్చ మొదలైంది. అయితే ఆ సందేహానికి తెర దించుతూ.. వరుడి తండ్రి ఆ శుభలేఖ వాస్తవమేనని తేల్చారు.

mamata benarjee weds am socailism
మమతా బెనర్జీ, ఏఎం సోషలిజంల పెళ్లి శుభలేఖ

అభిమానంతో..

సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లెనిన్‌ మోహన్‌.. తన కుమారులు సహా వధువు పేర్ల వెనక ఉన్న కారణాలను వెల్లడించారు. కమ్యూనిజంపై అభిమానంతోనే కుమారులకు అలాంటి పేర్లు పెట్టినట్టు ఆయన తెలిపారు. తన స్వగ్రామం కత్తూరులో ఎక్కువ మంది కమ్యూనిజాన్ని అభిమానిస్తారని.. అందుకే అక్కడ రష్యా, మాస్కో, జెకోస్లోవేకియా, రొమేనియా, వియత్నాం, వెన్మణి లాంటి పేర్లు సాధారణంగా వినిపిస్తాయని వివరించారు.

mamata benarjee weds am socailism
వరుడు ఏఎం సోషలిజం, వధువు పి.మమతా బెనర్జీ
mamata benarjee weds am socailism
కమ్యూనిజాన్ని అభిమానించే వరుడి కుటుంబం

ముఖ్యమంత్రి స్ఫూర్తితో..

వధువు కూడా తమ బంధువేనని, ఆమె తాతయ్య కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తి అని లెనిన్​ మోహన్​ చెప్పారు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి స్ఫూర్తి పొంది అమె పేరునే మనవరాలికి పెట్టినట్టు పేర్కొన్నారు. తమ భావజాలాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడానికి తన మనవడికి మార్క్సిజం అని పేరు పెట్టినట్టు తెలిపారు.

"కొవిడ్‌ నేపథ్యంలో పెళ్లి శుభలేఖను దినపత్రికలో ప్రచురించటం వల్ల అందరి దృష్టినీ అది ఆకర్షించింది. నిజమా.. కాదా అని నిర్ధరించుకునేందుకు మూడు రోజులుగా సన్నిహితులు, మీడియా నుంచి 300కి పైగా ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. విభిన్నమైన పేర్లు పెట్టుకున్నందుకు అందరూ అభినందిస్తుండటం వల్ల నా కుమారులు కూడా సంతోషంగా ఉన్నారు."

-లెనిన్​ మోహన్​, వరుడి తండ్రి.

భవిష్యత్తులో తమ ఇంట్లో అమ్మాయి పుడితే ఆమెకు క్యుబాయిజం అని నామకరణం చేస్తానని లెనిన్​ మోహన్​ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: 'అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వొద్దు- అత్యాచారాలకు అవే కారణం'

ఇదీ చూడండి: ఏటా రెండు సార్లే నడిచే రైలు.!

Last Updated : Jun 11, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.