భారత్లో కరోనా టీకా తీసుకున్న వారిలో ఎక్కువమందికి ఎలాంటి దుష్ప్రభావాలు(Vaccine Side Effects) కలగలేదని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కొంత మందిలో మాత్రం స్వల్ప జ్వరం వంటి లక్షణాలు కనిపించినట్లు స్పష్టమైంది.
దేశవ్యాప్తంగా కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు తీసుకున్న వారిపై ఈ పరిశోధన జరిగింది.
సర్వే ప్రకారం..
- కొవిషీల్డ్ టీకా మొదటి డోసు తీసుకున్న 70శాతం మందిలో స్వల్ప దుష్ప్రభావాలు, లేదా అసలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.
- కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్న 64 శాతం మందిలో చాలావరకు సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కొందరికి స్వల్ప జ్వరం వచ్చింది.
- కొవిషీల్డ్ రెండో డోసు తీసుకున్న 75శాతం మంది, కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న 78మందిలో ఇదే తరహా లక్షణాలు కనిపించాయి.
- కొవిషీల్డ్ రెండో డోసు తీసుకున్న తర్వాత 4శాతం మంది కరోనా బారినపడ్డారు. ఒక్క శాతం మందిలో జ్వరం కంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి.
- కొవాగ్జిన్ టీకా రెండో డోసు తీసుకున్న 2 శాతం మందికి కరోనా సోకింది. 3 శాతం మందిలో జ్వరం కంటే తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కన్పించాయి.
దేశవ్యాప్తంగా 381 జిల్లాల్లోని 40,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. వీరిలో 68 శాతం మంది పురుషులు కాగా.. 38 శాతం మంది స్త్రీలు.
భారత్లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 60 కోట్ల డోసులు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: పిల్లలపై కరోనా పంజా- కొత్త కేసులు వారిలోనే అధికం!