కేరళ ఎర్నాకుళం జిల్లా ఎలూరు నగరంలోని ఐశ్వర్య బంగారం దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగల దుకాణానికి ఆనుకొని ఉన్న సెలూన్ షాపుకు కన్నం వేసి దుండగులు బంగారం షాపులోకి ప్రవేశించారు. మూడు కిలోల బంగారం, 25కిలోల వెండి ఆభరణాలను అపహరించారు. షాపు యజమాని సోమవారం ఉదయం దుకాణం తెరవటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులతో పోలీసులు రంగంలోకి దిగారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించారు. దుకాణంలోకి సీసీ కెమెరాలు సైతం పనిచేయటంలేదని యజమాని తెలిపారు.