ఛత్తీస్‌గఢ్‌లోని జగ్‌దల్‌పుర్ సమీపంలోని చుయ్‌లోని సున్నపు రాయి గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ మైన్ కూలిన ఘటనలో.. ఇప్పటి వరకు ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. సుమారు 15మంది ఇంకా శిథిలాల కిందే చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
బస్తర్‌లోని మల్గావ్ ప్రాంతంలో కొంతమంది గ్రామస్థులు సున్నం కోసం తవ్వకాలు.. జరుపుతుండగా ఉన్నట్లుండి మైన్ కూలినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఫ్, రెస్క్యూ బృందాలు జేసీబీలతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని అధికారులు తెలిపారు.
కుప్పకూలిన సున్నపురాయి గని.. ఏడుగురు మృతి.. శిథిలాల్లో మరో 15 మంది! - ఛత్తీస్‌గఢ్ చుయ్ సున్నపు గని ప్రమాదం
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మైన్‌లో తవ్వకాలు జరుగుతుండగా ప్రమాదం జరిగి ఏడుగురు కూలీలు మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు.