బంగాల్ పర్యటనలో ఉన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తృణమూల్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం అమలుపై అనుమానాలు వ్యక్తం చేసిన రాజ్‌నాథ్.. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం జన్‌ధన్ ఖాతాలను తెరిచిందో లేదో తెలియదన్నారు. మజ్బూత్ పీఎం(శక్తిమంతమైన పీఎం) నరేంద్ర మోదీ, 100 పైసలు వాగ్దానం చేస్తే.. ఆ మొత్తం ప్రజలకు చేరుతాయన్నారు.
"బంగాల్‌లో జన్‌ధన్ ఖాతాలను తెరవడానికి దీదీ అనుమతించారో లేదో నాకు తెలియదు. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పంపిన 100 పైసల్లో 14 పైసలే ప్రజలకు చేరుతాయని చెప్పారు. అయితే మోదీజీ మజ్బూర్ పీఎం కాదు, మజ్బూత్ పీఎం. 100 పైసలూ ప్రజలకు చేరేలా చూస్తున్నారు."
- రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి
'రాజకీయాలే ఎక్కువ'
బంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వం.. ప్రజల కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని.. అందుకే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు రాజ్‌నాథ్. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా ప్రభుత్వం.. కుల, మతాలపై కాకుండా సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తుందన్న రాజ్‌నాథ్.. అందరికీ న్యాయం చేస్తుందన్నారు.
రాష్ట్రంలో భాజపా ర్యాలీలో భారీగా సంఖ్యలో ప్రజలు హాజరవడం.. దీదీ నుంచి విముక్తి పొంది, భాజపాను గద్దె ఎక్కించడానికి సూచిక అని పేర్కొన్నారు రాజ్‌నాథ్ సింగ్.
'మ్యాచ్ కచ్చితంగా ఉంటుంది'
అసెంబ్లీ ఎన్నికను ఉద్దేశించి.. మ్యాచ్ ఉందన్న మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు రాజ్‌నాథ్. "మ్యాచ్ ఉంటుందని దీదీ పేర్కొన్నారు. కచ్చితంగా మ్యాచ్ ఉంటుందని నేను కూడా చెబుతున్నాను. అది ఒక మెగా మ్యాచ్. అది అభివృద్ధి, శాంతితో జరుగుతుంది" అని అన్నారు.
దీదీకి దీటుగా..
దేశంలో పెరిగిన ఇంధన ధరలను నిరసిస్తూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడిపారు. దీనికి దీటుగా.. ఇవాళ బలూర్‌ఘాట్‌లో భాజపా పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ కూడా స్కూటర్ నడిపారు.
ఇవీ చూడండి: