ETV Bharat / bharat

Mahbubnagar, Telangana Assembly Election Result Live : మహబూబ్​నగర్​లో కాంగ్రెస్ హవా - 12 స్థానాల్లో ముందంజ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు న్యూస్

Mahbubnagar Telangana Assembly Election Result Live : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ హవా సాగుతోంది. మరో 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు.

Mahbubnagar Telangana Assembly Election
Mahbubnagar Telangana Assembly Election Result Live
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 3:17 PM IST

Updated : Dec 3, 2023, 3:33 PM IST

Mahbubnagar Telangana Assembly Election Result Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. వీటిలో 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ముందంజలో ఉన్న స్థానాల్లో కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి గెలుపొందారు. 31,849 ఓట్ల మెజార్టీతో పట్నం నరేందర్ ​రెడ్డిపై విజయం సాధించారు. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి, దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్​రెడ్డి గెలుపొందారు. వీటితో పాటు మరో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

నియోజకవర్గాల వారీగా వివరాలు ,:

కొడంగల్ : కొడంగల్​లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్రరెడ్డిపై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

జడ్చర్ల : బీఆర్​ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జె. అనిరుధ్ రెడ్డి గెలుపొందారు.

నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కే. రాజేష్​రెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిపై గెలుపు జెండా ఎగురవేశారు.

వనపర్తి : బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి టి. మేఘారెడ్డి ఘనవిజయం సాధించారు.

నారాయణ్ పేట్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఆమె ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి పై గెలుపొందారు.

దేవరకద్ర : బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జి. మధుసూదన్​రెడ్డి గెలుపొందారు.

షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ అభ్యర్థి యెల్గనమోని అంజయ్య యాదవ్​పై కె. శంకరయ్య విజయం సాధించారు.

కల్వకుర్తి : ఈ నియోజకవర్గంలో బీఆర్​ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్​పై కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు.

అచ్చంపేట : బీఆర్​ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ముందంజలో ఉన్నారు.

కొల్లాపూర్ : ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కాగా కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ముందంజలో ఉన్నారు. బీఆర్​ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కర్నె బర్రెలక్క తన ప్రభావాన్ని చూపలేకపోయింది.

మహబూబ్​నగర్ : బీఆర్​ఎస్ అభ్యర్థి శ్రీనివాస్​గౌడ్​పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి ముందంజలో ఉన్నారు.

మక్తల్ : బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి ముందంజలో ఉన్నారు.

అలంపూర్ : బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ముందంజలో ఉన్నారు.

గద్వాల్ : గద్వాల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

Last Updated : Dec 3, 2023, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.