ETV Bharat / bharat

'రైతు ఉద్యమం శాంతియుతంగా జరపాలి'

author img

By

Published : Feb 14, 2021, 5:52 AM IST

అన్నదాతలు ఆందోళన చేస్తోన్న గాజీపుర్ సరిహద్దును సందర్శించారు మహాత్మా గాంధీ మనవరాలు తారా గాంధీ. నిరసనలు శాంతియుతంగా ఉండాలన్న తారా.. రైతులను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Mahatma Gandhi's granddaughter visits farmers' protest site in Ghazipur
గాజీపుర్ సరిహద్దును సందర్శించిన గాంధీ మనవరాలు తారా

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న గాజీపుర్ సరిహద్దును సందర్శించారు మహాత్మ గాంధీ మనవరాలు తార గాంధీ. శాంతియుతంగా నిరసనలు జరపాలని రైతులకు సూచించిన తారా.. అన్నదాతలను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇవ్వనున్నట్లు భారతీయ కిసాన్​ యూనియన్​ తెలిపింది.

"ఎలాంటి రాజకీయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు(గాజీపుర్​ సరిహద్దు)రాలేదు. మనం బతకడానికి ఆహారాన్ని అందించే రైతుల కోసమే వచ్చాను. మీ (రైతులు) వల్ల అందరం బతుకుతున్నాం. రైతుల ప్రయోజనంలో మన దేశానికి, మనందరికీ ప్రయోజనం ఉంది. ఏది జరిగినా రైతులు దాని ద్వారా ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను."

-తారా గాంధీ, మహాత్మా గాంధీ మనవరాలు

తారా గాంధీ.. ప్రస్తుతం నేషనల్​ గాంధీ మ్యూజియం ఛైర్​పర్సన్​గా ఉన్నారు.

ఇదీ చూడండి: రైల్​ రోకోపై నరేశ్​ టికాయిత్​ అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.