ETV Bharat / bharat

'ఆ 40 మంది బతికి ఉన్న శవాలు.. వచ్చాక అక్కడికే పంపిస్తాం' - ఆదిత్య ఠాక్రే ప్రసంగం

Maharashtra political crisis: రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. పిరికివాళ్లే పార్టీని విడిచి వెళ్లారని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే అన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే గుణపాఠం ఇప్పుడు నేర్చుకున్నట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రెబల్ ఎమ్మెల్యేలను బతికున్న శవాలుగా అభివర్ణించారు.

Maharashtra political crisis
Maharashtra political crisis
author img

By

Published : Jun 26, 2022, 6:34 PM IST

Updated : Jun 26, 2022, 8:54 PM IST

Maharashtra politics news: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన తారస్థాయికి చేరిన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా పలువురు సీనియర్ నేతలు రెబల్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ముంబయి, పుణె సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్​కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దహిసర్​లో నిర్వహించిన పార్టీ కేడర్ సమావేశంలో మాట్లాడిన సంజయ్ రౌత్.. ప్రస్తుత సంక్షోభం శివసేన పునర్నిర్మాణానికి అవకాశమని అన్నారు. 'ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అన్న గుణపాఠం ఇప్పుడు నేర్చుకున్నాం. గువాహటిలో ఉన్న 40 మంది ఎమ్మెల్యేలు బతికున్న శవాల్లాంటివారు. వారి శరీరాలు ముంబయికి తిరిగిరాగానే నేరుగా అసెంబ్లీకి పోస్టుమార్టం కోసం పంపిస్తాం. వారి ఆత్మలు కూడా చనిపోయాయి' అని శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు రౌత్.

రెబల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రే సైతం విమర్శలు గుప్పించారు. కేవలం పిరికివాళ్లే పార్టీని విడిచివెళ్లారన్న ఆయన.. రెబల్‌ నేతలకు భద్రత కల్పించడమేంటని ప్రశ్నించారు. కశ్మీరీ పండితులకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత అవసరమని.. గుహవాటికి పారిపోయిన వాళ్లకు కాదంటూ శిందే క్యాంపుపై విమర్శలు గుప్పించారు. ముంబయిలోని కలీనా, శాంటాక్రజ్ ప్రాంతాల్లో శివసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడిన ఆదిత్య ఠాక్రే.. శివసేన గుర్తును, ప్రజల ప్రేమను రెబల్‌ నేతలు తీసుకెళ్లలేరంటూ వ్యాఖ్యానించారు. శివసేన కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఠాక్రే.. ద్రోహులకు పార్టీలో స్థానం ఉండదని అన్నారు. 'మనం చేసింది తప్పని, ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వానిది తప్పని భావిస్తే మనందరిదీ తప్పే. అటువంటప్పుడు పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయండి. అందుకు మేము కూడా సిద్ధమే' అని శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు.

నాన్న అప్పుడే అడిగారు: మే 20నే ఉద్ధవ్​ ఠాక్రే.. ఏక్​నాథ్​ శిందేను పిలిచి సీఎం పదవి కావాలంటే తీసుకో అన్నారని చెప్పారు ఆదిత్య ఠాక్రే. అప్పుడు డ్రామా చేసిన శిందే.. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారని ఆరోపించారు. అది తిరుగుబాటు కాదని, వేర్పాటువాదం అని అన్నారు. ఉద్ధవ్​ ఠాక్రే అనారోగ్యాన్ని.. వారు తమకు అనుకూలంగా మలుచుకున్నారని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను నమ్మక ద్రోహులని విమర్శించారు. పార్టీని వీడాలనుకున్నా.. రావాలనుకున్నా తలుపులు ఎప్పుడే తెరిచే ఉంటాయని తెలిపిన ఠాక్రే.. ద్రోహులను మాత్రం మళ్లీ శివసేనలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

పవార్ కీలక భేటీ
మరోవైపు, ఎన్సీపీ నేత శరద్ పవార్ మహావికాస్ అఘాడీ నేతలతో సమావేశమయ్యారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మంత్రులు బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, శివసేనకు చెందిన అనిల్ పరబ్, అనిల్ దేశాయ్​లతో భేటీ అయ్యారు. ఆరు రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పవార్ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సందర్భంగా ఠాక్రేకే తమ మద్దతు ఉంటుందని పవార్ మరోసారి తేల్చిచెప్పారు. 'ఏక్​నాథ్ శిందే సహా ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు కొత్త కూటమి ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్.. ప్రస్తుత కూటమికే మద్దతు ఇస్తున్నాయి. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ సర్కారు అధికారంలో ఉంది. దాన్ని కొనసాగించేందుకు మా మద్దతు ఉంటుంది. రెబల్ ఎమ్మెల్యేలు ఎన్సీపీతో కలిసి రెండున్నరేళ్లు ఉన్నారు. ఇంతకాలం లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది' అని పవార్ ప్రశ్నించారు.

బుజ్జగింపు యత్నాలు..
అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకూ ఠాక్రే కుటుంబీకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగంలోకి దిగిన సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే.. అసమ్మతి నేతల భార్యలతో చర్చలు జరుపుతున్నారు. వారి భర్తల్ని ఎలాగైనా రాజీకి వచ్చేలా చేయాలని రష్మీ ఠాక్రే కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్ధవ్‌ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నారని.. దాదాపు 20మంది రెబల్‌ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని ఠాక్రే వర్గీయులు పేర్కొంటున్నారు.

మరో మంత్రి గువాహటికి..
అసోంలోని గువాహటి హోటల్‌లో మకాం చేసిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు ఇంకా వేచిచూసే ధోరణినే అవలంబిస్తున్నారు. మరోవైపు, మరో శివసేన నేత, రాష్ట్ర కేబినెట్ మంత్రి ఉదయ్ సామంత్ సైతం గువాహటికి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ఉదయ్​ను సంప్రదించినా.. స్పందించడం లేదని సమాచారం. ఓ ఎయిర్​పోర్ట్ సర్వీస్ లిస్ట్​లో ఉదయ్ సామంత్ పేరు ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో గమ్యస్థలం గువాహటి అని ఉంది. దీంతో ఆయన అసోంలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లినట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏడుగురు శివసేన మంత్రులు.. శిందే వర్గంలోకి వెళ్లారు.

ఇదిలా ఉండగా.. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. వారికి నోటీసులు పంపినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటే.. శాసనసభ్యుడిగా అనర్హతకు గురవుతారని శివసేన సీనియర్ న్యాయవాది దేవదత్త కామత్ వెల్లడించారు. శివసేన నిర్వహించిన వివిధ మీటింగ్​లకు వారు హాజరుకాలేదని.. భాజపా పాలిత రాష్ట్రాల్లో తిరుగుతూ ఆ పార్టీ నేతలను కలుస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వారిపై నిషేధం విధించవచ్చని అన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 26, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.