దేశంలో కొవిడ్ కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 66,191 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 832 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే.. 5,542 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్ కారణంగా మహానగరంలో మరో 64 మంది మరణించారు. నాగ్‌పుర్ జిల్లాలో 7,771 మందికి కరోనా సోకగా.. వైరస్ దాటికి మరో 87 మంది ప్రాణాలు కోల్పోయారు.
మిగతా రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ పంజా విసురుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 35,614 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 208 మంది మరణించారు.
- కర్ణాటకలో కొవిడ్ పంజా విసురుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,804 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 143 మంది బలయ్యారు.
- కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 28,469 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 30 మంది బలయ్యారు.
- గుజరాత్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 14,296 కేసులు నమోదయ్యాయి. మరో 157 మంది వైరస్‌తో మరణించారు.
- తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15 మార్కుని చేరుకుంది. మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 15,809 మందికి వైరస్ సోకింది. కొవిడ్‌తో మరో 74 మంది మరణించారు.
- దిల్లీలో కొత్తగా 22,933 మందికి కరోనా సోకింది. మరో 350 మంది వైరస్ కారణంగా మరణించారు.
- బిహార్‌లో మరో 12,795 మందికి కరోనా నిర్ధరణ అయ్యింది. 7,533 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- బంగాల్లో మరో 15,889 కొత్త కేసులు నమోదయ్యాయి. 57 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.
ఇదీ చూడండి: 'కరోనా 2.0ను అంచనా వేయడంలో భారత్ విఫలం'