మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు మంగళవారం రాత్రి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కోరారు. గతేడాది జూన్ 12న తొలిసారి ముండేకు కరోనా సోకింది. కొద్ది రోజుల అనంతరం కోలుకున్నారు.
'' రెండోసారి నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్దిరోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. భయపడాల్సిన పనిలేదు. అందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.''
- ధనంజయ్ ముండే, మహారాష్ట్ర మంత్రి
మహారాష్ట్ర కేబినెట్ మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు కూడా 3 రోజులు కిందట కొవిడ్ సోకింది.
రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మంగళవారం 28 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం 25 లక్షల 33 వేలమందికిపైగా కరోనా సోకగా.. ప్రస్తుతం 2 లక్షల 30 వేల యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చూడండి: నక్సల్స్ ఘాతుకం- ఐదుగురు జవాన్లు మృతి