ETV Bharat / bharat

ఉచిత ఆక్సిజన్​తో 5,500 మందిని కాపాడిన యువకుడు! - షహ్నవాజ్ షేక్

కొవిడ్​ రోగులకు ఉచితంగా అక్సిజన్​ సిలిండర్లు అందిస్తూ ఓ యువకుడు పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. ఇప్పటివరకు దాదాపు 5,500 మంది ప్రాణాలు కాపాడాడు ఈ మహారాష్ట్ర యువకుడు.

shahnawaz sheik
షహ్నవాజ్ షేక్, ప్రాణవాయువు
author img

By

Published : Apr 26, 2021, 3:30 PM IST

Updated : Apr 26, 2021, 4:32 PM IST

ఉచిత ఆక్సిజన్​తో 5,500 మందిని కాపాడిన యువకుడు!

కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారి కష్టాలను చూడలేకపోయాడు ముంబయికి చెందిన ఓ యువకుడు. తనకు వీలైనంతలో కొవిడ్​ రోగులకు సాయం చేయాలని ముందడుగు వేశాడు. ఇందుకోసం రూ. 22 లక్షలు విలువ చేసే సొంత కారు అమ్మేందుకు వెనకాడలేదు.

మిత్రుడి సోదరి మరణానంతరం..

ఆక్సిజన్ కొరత కారణంగా తన మిత్రుడి సోదరి మరణించడాన్ని చూసి షహ్నవాజ్​ షేక్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదని.. తన కారును అమ్మి 160 ఆక్సిజన్​ సిలిండర్లు కొన్నాడు. అవసరమున్న కొవిడ్​ రోగులకు వాటిని ఉచితంగా ఇచ్చాడు. ఈ కార్యక్రమం కొనసాగించేందుకు నిధులు సేకరిస్తూ పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక్క ఫోన్​ చేస్తే చాలు రోగులకు ఆక్సిజన్​ సిలిండర్​ సరఫరా చేస్తానని భరోసా ఇస్తున్నాడు. ఇప్పటివరకు షహ్నవాజ్ 5,500 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాడు. ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.

"విపత్కర పరిస్థితుల్లో ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. కొవిడ్ వైరస్​ రెండో దశ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు."

-షహ్నవాజ్ షేక్

మహారాష్ట్రలో కొవిడ్​ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వైరస్​ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో షహ్నబాజ్ చేస్తున్న సేవను ప్రతిఒక్కరు కొనియాడుతున్నారు.

ఇదీ చదవండి:ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన

Last Updated : Apr 26, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.