Electric scooter news: మహారాష్ట్ర పర్లీ వైజ్నాథ్కు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో చేసిన నిరసన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అతను ఎలక్ట్రిక్ స్కూటర్‌ను గాడిదకు కట్టి రోడ్డుపై తిప్పాడు. రెండింటికీ, తాళ్లు, బ్యానర్లు కట్టి ఊరేగించాడు. వెనకాల ఉన్న మరో వ్యక్తి స్కూటర్‌ను పట్టుకోగా.. నిరససన చేసిన వ్యక్తి గాడిద చెవులు పట్టుకున్నాడు. ఓ బాలుడు గాడిదను చిన్నకర్ర సాయంతో ముందుకునడిపిస్తూ వీరికి సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఏం జరిగింది?: వినూత్నంగా నిరసన చేపట్టిన ఈ వ్యక్తి పేరు సచిన్ గిట్టే. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసిగెత్తిపోయాడు. అదే సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన ఆకర్షణీయ ప్రకటనలు చూశాడు. ఇది కొంటే పెట్రోభారం తగ్గుతుందని భావించాడు. గతేడాది సెప్టెంబర్‌లో రూ.20,000వేలు అడ్వాన్స్ చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన రూ.65వేలను ఈ ఏడాది జనవరి 21న కట్టాడు. ఎట్టకేలకు మార్చి 24న స్కూటర్ ఇంటికి వచ్చింది. అయితే సరిగ్గా రెండు వారాలకే అది పనిచేయడం ఆగిపోయింది. సాంకేతిక సమస్యతో ఏప్రిల్ 8 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్ట్ కావట్లేదు. దీంతో అతను కంపెనీ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేశాడు. సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అటువైపు నుంచి స్పందన సరిగ్గా లేదు. ఓ మెకానిక్‌ను పంపించినా.. అతను కూడా స్కూటర్‌ను బాగు చేయలేకపోయాడు.
-
Video: गधे से बांध कर ग्राहक ने चलाई स्कूटी pic.twitter.com/S2aEvwO4e8
— Yashveer Singh🇮🇳 (@iyashveer) April 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Video: गधे से बांध कर ग्राहक ने चलाई स्कूटी pic.twitter.com/S2aEvwO4e8
— Yashveer Singh🇮🇳 (@iyashveer) April 25, 2022Video: गधे से बांध कर ग्राहक ने चलाई स्कूटी pic.twitter.com/S2aEvwO4e8
— Yashveer Singh🇮🇳 (@iyashveer) April 25, 2022
Electric scooter protest: దీంతో విసిగివేసారిన సచిన్ గిట్టే ఒకానొక సమయంలో స్కూటర్‌కు నిప్పుపెట్టి తగలబెడదామనుకున్నాడు. ఎలాంటి ఉపయోగం లేని ఈ వాహనం ఎందుకు అనుకున్నాడు. అయితే ఆ ఆలోచన విరమించుకుని కంపెనీపై నిరసన వ్యక్తం చేయాలనుకున్నాడు. అందుకే గాడిదకు స్కూటర్‌ను కట్టి బీడ్‌లోని రోడ్లపై ఆదివారం తిప్పాడు. ఇప్పుడైనా కంపెనీ స్పందించి తన సమస్యను తీర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. లేకపోతే వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.
ఇదీ చదవండి: 16నెలల చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్.. సోనూసూద్ భారీ సాయం