ETV Bharat / bharat

ఆక్సిజన్​ పేరుతో సీఓ2 సిలిండర్ల విక్రయం - కార్బన్​డై ఆక్సైడ్​ మోసాలు

మహారాష్ట్రలో ప్రాణావాయువు పేరుతో కార్బన్​డై ఆక్సైడ్​ సిలిండర్లు విక్రయిస్తోన్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు ఓ సామాజిక కార్యకర్త. ఈ సిలిండర్లు రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, అవి పేలిపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

oxygen
ఆక్సిజన్
author img

By

Published : May 5, 2021, 3:32 PM IST

కరోనా విజృంభణ వేళ ఆక్సిజన్​ సిలిండర్లను అధిక ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటుండగా.. కార్బన్​ డై ఆక్సైడ్​ సిలిండర్లు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు మరికొందరు. మహారాష్ట్ర జల్​గావ్​ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

జిల్లాలోని ఓ వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ల పేరుతో కార్బన్​ డైఆక్సైడ్​ నిల్వకు ఉద్దేశించిన ఖాళీ​ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సిలిండర్ల వల్ల పేలుడు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు.

"ముందుగా కార్బన్​డై ఆక్సైడ్​ నింపిన ఖాళీ సిలిండర్లలో ఆక్సిజన్ నింపినట్లయితే అవి పేలిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి సిలిండర్లు రోగి ఆరోగ్యానికి కూడా హానికరమని రుజువయ్యాయి" అని ఆయన చెప్పారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మంత్రి.. దీనిపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: 'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్​ వస్తుందా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.