దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 48,621 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 567 మంది మరణించారు. 30 రోజుల తర్వాత 50 వేలకు తక్కువగా కేసులు నమోదు కాడవం ఇదే తొలిసారి. కర్ణాటకలో కొత్తగా రికార్డు స్థాయిలో 44,438 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 239 మంది మృతి చెందారు. తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో 20,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 122 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు |
ఉత్తర్ ప్రదేశ్ | 29,192 | 288 |
కేరళ | 26,011 | 45 |
తమిళనాడు | 20,952 | 122 |
మధ్యప్రదేశ్ | 12,062 | 93 |
ఉత్తరాఖండ్ | 5,403 | 128 |
రాజస్థాన్ | 17,296 | 154 |
ఒడిశా | 8,914 | 5 |
ఇదీ చదవండి : కేంద్ర విద్యాసంస్థల పరీక్షలు వాయిదా!