కన్నబిడ్డ కోసం చిరుతపులితో వీరోచితంగా పోరాడింది ఓ మహిళ. చివరకు తన బిడ్డను పులి పంజా నుంచి కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
చంద్రపుర్ జిల్లాలో జునోనా.. ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన కుటుంబం నివసిస్తుంది. కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది. పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతను చితకబాదింది. తనపై కూడా చిరుత దాడి చేసినప్పటికీ ఆ కర్రతోనే పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు పోరాటం చేసింది. దీంతో ఏమీ చేయలేక అడవుల్లోకి పారిపోయింది ఆ చిరుత. ఫలితంగా ఆ తల్లికి తన కూతురు దక్కింది.
ఇదీ చూడండి: స్టేజిపైనే వరుడు నిద్ర.. వధువు రియాక్షన్ చూస్తే...