ETV Bharat / bharat

మహాదేవ్ బెట్టింగ్ యాప్​ కేసు- 'ప్రమోటర్ల నుంచి సీఎం బఘేల్​కు రూ.508కోట్ల చెల్లింపులు' - ed raids rajasthan

Mahadev Betting App Scam ED : ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​కు మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఇప్పటివరకు రూ.508 కోట్లు ఇచ్చారని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​(ఈడీ) ఆరోపించింది.

Mahadev Betting App Scam ED
Mahadev Betting App Scam ED
author img

By PTI

Published : Nov 3, 2023, 8:12 PM IST

Updated : Nov 3, 2023, 9:58 PM IST

Mahadev Betting App Scam ED : ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల వేల కీలక పరిణామం జరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ మెడకు చుట్టుకుంది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్లు మేర ఇచ్చినట్లు ఆరోపించింది. దీనిపై విచారణ చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ కేసులో యూఏఈ నుంచి వచ్చిన క్యాష్‌ కొరియర్‌గా పేర్కొనే అసిమ్‌ దాస్‌ అనే వ్యక్తి ఇళ్లు, కారులో రూ.5.39 కోట్ల నగదును ఈడీ సీజ్‌ చేసింది. అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ ప్రకటించింది.

  • ED conducted search operations on 2/11/2023 against the money laundering networks linked with Mahadev Book Online Betting APP in Chhattisgarh in which Cash of Rs 5.39 Crore and Bank balance of Rs 15.59 Crore has been intercepted and frozen/seized: ED pic.twitter.com/2i0ITl9Wtx

    — ANI (@ANI) November 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'క్యాష్‌ కొరియర్‌' అసిమ్‌దాస్‌ను విచారించి.. అతడి నుంచి వాంగ్మూలం రికార్డు చేసినట్లు ఈడీ పేర్కొంది. అలాగే, అతడి ఫోన్‌ సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించగా.. శుభం సోనీ (మహదేవ్‌ నెట్‌వర్క్‌లో కీలక నిందితుల్లో ఒకరు) పంపిన ఈ-మెయిల్‌ను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు తెలిశాయని పేర్కొంది. గతంలో రెగ్యులర్‌గా చెల్లింపులు జరిగాయని.. ఇప్పటివరకు మహదేవ్‌ యాప్‌ ప్రమోటర్లు సీఎం భూపేశ్‌ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు మేర చెల్లించినట్లు ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈడీ సీజ్‌ చేసిన డబ్బును ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న ఎన్నికల ఖర్చు కోసం యాప్‌ ప్రమోటర్లు ఒక రాజకీయ నేతకు డెలివరీ చేసేందుకు పంపించినట్లు అసిమ్‌ దాస్‌ అంగీకరించాడని ఈడీ ఆరోపించింది. ఈ నగదు సీజ్‌కు సంబంధించిన వ్యవహారంలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ను కూడా అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.

ED Raids Rajasthan : మరోవైపు.. రాజస్థాన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ED మరోసారి సోదాలు చేపట్టింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణం కేసు విచారణలో భాగంగా శుక్రవారం.. జైపుర్‌తో పాటు దౌసాల్లో మొత్తం 25 చోట్ల దాడులు నిర్వహించింది. పలువురు IASలు సహా ఇతర అధికారుల ఇళ్లలో సోదాలు చేసింది. మనీలాండరింగ్‌కు సంబంధమున్న ఇతర వ్యక్తుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించింది. సెప్టెంబర్‌లోనూ ఈడీ అధికారులు జల్ జీవన్ మిషన్ కుంభకోణం కేసులో పలువురు అధికారుల ఇళ్లలో దాడులు చేశారు.

ED Raids Tamil Nadu : తమిళనాడులోని పలు చోట్ల ఐటీశాఖ అధికారులు దాడులు చేశారు. మంత్రి ఈవీ వేలు నివాసాల్లో సోదాలు చేపట్టారు. డీఎంకేలో కీలక నేతగా ఉన్న ఈవీ వేలును లక్ష్యంగా చేసుకొని ఐటీశాఖ దాడులు చేయడంపై డీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఐటీ, ఈడీలు బీజేపీకి రాజకీయ విభాగాలుగా మారిపోయాయని.. ఇలాంటి చర్యల్ని తాము చట్టపరంగా ఎదుర్కొంటామని మంత్రి ఉదయనిధి అన్నారు. తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు, తిరువన్నామలై, కారూర్‌లలో ఐటీ సోదాలు కొనసాగినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. డీఎంకేలో కీలక నేత అయిన ఈవీ వేలు.. ప్రస్తుతం స్టాలిన్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు.

Last Updated : Nov 3, 2023, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.