దేశంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో రోడ్లు నెత్తురోడాయి. చిన్నారులతో సహా (road accident in india) పలువురు మృతి చెందారు.
మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి- ఆగ్రా రహదారిలో బైక్ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో (accident news in maharastra) ముగ్గురు బాలికలతో సహా ఓ యువకుడు మృతి చెందాడు. బాధితులు పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే వారు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.
ఓ శిశువుతో సహా.. ఇద్దరు మహిళలు
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఎస్యూవీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఓ శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. జైపుర్-బికనేర్ జాతీయ రహదారిలో ఈ ఘటన జరిగింది.
బాలుడు మృతి.. 8 మందికి గాయాలు..
జమ్ముకశ్మీర్ రాంబన్ జిల్లాలో పిల్లలతో ప్రయాణిస్తున్న ఓ ఆటో (accident news in jammu kashmir) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ బాలుడు(6) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
ఇదీ చదవండి: చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు- నలుగురు చిన్నారులు మృతి