మైనర్ ప్రియురాలిని బలవంతంగా ఎత్తుకెళ్లాడనే ఆరోపణలపై 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
నిందితుడు సమీర్ ఖాన్‌కు 17 ఏళ్ల బాలికతో ఉన్న పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారిద్దరూ తరచూ టిక్‌టాక్ వీడియోలు చేసేవారు. వివాహం చేసుకుంటాననే హామీతో ఆమెతో శారీరకంగానూ కలిశాడు సమీర్.
అయితే.. ఆ అమ్మాయికి మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతో వారి బంధం చెడిపోయింది. ఈ క్రమంలోనే జూన్ 18న తన స్నేహితుడు సిద్ధిఖీతో కలిసి అమ్మాయిని బలవంతంగా బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు సమీర్. ఈ తంతును వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పెట్టారు.
నిందితులు.. వీటాభట్టి ప్రాంతానికి అమ్మాయికి తీసుకెళ్లి దూషించి, కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఆమెను చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పారిపోయినట్లు వెల్లడించారు. స్థానికులు ఈ ఘటనపై ట్విట్టర్లో పోలీసులకు సమాచారం అందించగా.. స్నేహితులిద్దరినీ అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సహా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: Border: ప్రేయసి కోసం సరిహద్దు దాటి..