కూతురిపై అత్యాచారం చేసిన ఘటనలో పోలీసులు.. తండ్రి(47)ని అరెస్టు చేశారు. మహారాష్ట్ర, నవీ ముంబయిలోని బెలాపూర్లో ఈ అమానుష ఘటన జరిగింది.
ఇదీ జరిగింది..
నిందితుడి భార్య చనిపోయింది. అతను డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. నిందితుడు తన 12 ఏళ్ల కూతురుని వేధింపులుకు గురిచేశాడు. 13 ఏళ్ల మరో కూతురిపై అత్యాచారం చేశాడు. 17 ఏళ్ల మరో కూతురుని ప్రశ్నించగా.. ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇన్స్పెక్టర్ రవీంద్ర పాటిల్ చెప్పారు. ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని నిందితుడు తన కూతుళ్లను భయబ్రాంతులకు గురిచేశాడని వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: బిహార్లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం