అతనో వ్యాపారి. కానీ, తన అత్యాశతో తన వద్ద ఉన్న రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇక తన కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఓ కట్టుకథ సిద్ధం చేసుకున్నాడు. కానీ, పోలీసులు మాత్రం అతడు చెప్పింది అబద్ధమని ఇట్టే గ్రహించేశారు.
కొంపముంచిన బిట్‌కాయిన్ ట్రేడింగ్..
మహారాష్ట్రలోని పాల్గఢ్కు చెందిన వ్యాపారి సుమంత్ లింగాయత్... వచ్చే నెలలో జరగనున్న తన కమార్తె వివాహం కోసం రూ.10 లక్షలు దాచిపెట్టాడు. కానీ, ఇటీవల అతడు బిట్‌కాయిన్‌లో ట్రేడ్ (bitcoin news) చేసి, ఆ డబ్బులను పోగొట్టుకున్నాడు. కుటుంబ సభ్యులను ఎలా ఎదుర్కోవాలో తెలియక అతడు... వాసాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన వద్ద ఉన్న డబ్బుల సంచిని బైక్‌పై వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి... లాక్కుని (fake robbery in maharashtra) పరారయ్యాడని ఫిర్యాదు చేశాడు.
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే.. దర్యాప్తులో సుమంత్ లింగాయత్ చెప్పిన దాంట్లో నిజం లేదని గుర్తించారు. చివరికి సుమంత్ నిజాన్ని అంగీకరించాడు. సదరు వ్యాపారిని హెచ్చరించినట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చూడండి: Third Wave in India: భారత్‌కు కరోనా మూడో ముప్పు లేనట్టే!