సరైన ప్రణాళిక లేని కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల కరోనా టీకా డోసుల్ని వృథా చేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు. ఇంకా మహారాష్ట్ర వద్ద 23లక్షల కరోనా టీకా డోసులు ఉన్నాయని, అవి ఐదారు రోజులు వస్తాయని తెలిపారు. ముందుకంటే ఇప్పుడు మహారాష్ట్రకు ఎక్కువ కరోనా టీకాల్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు.
కరోనా టీకాల కొరత కారణంగా వ్యాక్సినేషన్ కేంద్రాల్ని మూసివేయాల్సి వస్తోందని బుధవారం మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే అన్నారు. కేవలం తమ వద్ద 14లక్షల డోసులే ఉన్నాయని అవి మూడు రోజులే వస్తాయని తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు జావడేకర్.
ఇదీ చదవండి: 'ప్రజల దృష్టిని మరల్చడానికే 'టీకా కొరత' వ్యాఖ్యలు'