ETV Bharat / bharat

దేశ్​ముఖ్​ వ్యవహారంలో సుప్రీంకు మహా సర్కార్ - అనిల్​ దేశ్​ముఖ్ కేసుపై సుప్రీం

మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​పై సీబీఐ విచారణ జరపాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఆదేశాలను సవాల్​ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

SC
హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న మహారాష్ట్ర సర్కార్
author img

By

Published : Apr 6, 2021, 3:58 PM IST

Updated : Apr 6, 2021, 6:32 PM IST

రూ.100 కోట్ల వసూళ్ల వ్యవహారంపై బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు పిటిషన్​ దాఖలు చేసింది.

ముంబయిలోని హోటళ్లు, బార్ల యజమానుల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్​ తమకు సూచించారని ఆరోపించారు ఆ నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్​ సింగ్. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది బాంబే హైకోర్టు. 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి, అవసరమైతే ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారు కోరింది.

ఇదీ చదవండి:'మే 2న టీఎంసీ కథ కంచికే!'

Last Updated : Apr 6, 2021, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.