ETV Bharat / bharat

అంబానీ వాకింగ్ చేశారని ఆ గ్రౌండ్ బంద్!​ - anil amabni evening walk park

కరోనా ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్​ అంబానీ ఓ గోల్ఫ్​ కోర్స్​లో వాకింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీంతో స్పందించిన అధికారులు.. ఆ మైదానాన్ని మూసివేయాలని ఆదేశించారు.

anil ambani
పార్కులో అంబానీ నడక
author img

By

Published : May 3, 2021, 5:19 PM IST

మహారాష్ట్ర మహాబలేశ్వర్​లోని ఓ గోల్ఫ్​ మైదానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్​ గ్రూపు ఛైర్మన్​ అనిల్​ అంబానీ తన కుటుంబంతో కలిసి సాయంత్రం వాకింగ్ చేస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారగా అధికారులు స్పందించారు. ఆ గోల్ఫ్​ కోర్స్​ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అసలేమైంది..?

కరోనా ఆంక్షలు ఉన్నప్పటికీ.. మహాబలేశ్వర్​లో తన భార్య టీనా, పిల్లలతో కలిసి ఓ గోల్ఫ్​ మైదానంలో అనిల్​ అంబానీ నడుస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దాంతో అధికారులు అప్రమత్తమై ఆ క్లబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. విపత్తు నిర్వహణ చట్టం సహా సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

"అనిల్​ అంబానీ వీడియోను ధ్రువీకరించుకున్నాక.. క్లబ్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. ఉదయం, సాయంత్రం నడక కోసం ప్రజలెవరూ పార్కు లోపలకు ప్రవేశించకూడదని ఆదేశించాం."

-మహాబలేశ్వర్​ కౌన్సిల్​ ప్రధానాధికారి పల్లవి పాటిల్​

నోటీసులు జారీ చేసిన అనంతరం గోల్ఫ్​ మైదానాన్ని మూసివేశారని పల్లవి పాటిల్ తెలిపారు. కొవిడ్​ ఆంక్షలు అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందు నుంచే మహాబలేశ్వర్​లో అనిల్​ అంబానీ కుటుంబం నివసిస్తోందని ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: కేరళ అసెంబ్లీలో మామాఅల్లుళ్ల సందడి

ఇదీ చూడండి: నందిగ్రామ్​​ ఫలితంపై మమత అనుమానాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.