ETV Bharat / bharat

ఈ 'సోలార్​ సైకిల్​'తో.. ఇంధన ఖర్చు ఆదా! - సోలార్​ సైకిల్

తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి సోలార్​ సైకిల్​ను రూపొందించాడు. పెట్రో ధరలు ఆకాశాన్ని అంటిన నేపథ్యంలో ఈ సైకిల్​కు ఆదరణ పెరుగుతోంది. ఈ సైకిల్​ను ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ధనుష్​ వెల్లడించాడు.

solar-powered electric cycle
సోలార్ సైకిల్
author img

By

Published : Jul 10, 2021, 3:10 PM IST

సోలార్ సైకిల్

దేశంలో పెట్రో, డీజిల్​ ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు చాలా మంది ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. ఇదే తరహాలో తమిళనాడు మధురైకి చెందిన ధనుష్​ అనే విద్యార్థి రూపొందించిన సోలార్​ సైకిల్​కు.. ప్రస్తుతం విశేష స్పందన లభిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్​ సైకిల్​.. పర్యావరణ హితమైనదే కాక ఇంధనాలపై అయ్యే ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తుంది. సైకిల్​కు అమర్చిన బ్యాటరీకి సోలార్​ ప్యానెల్స్​ను కనెక్ట్​ చేశాడు ధనుష్​. సౌర శక్తి సాయంతో నడితే ఈ సైకిల్​కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ సైకిల్​పైన 30-40కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 50 వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ దిగిపోయినా 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చన్నాడు ధనుష్. దీనిపై కిలోమీటరు ప్రయాణానికి అయ్యే ఖర్చు రూ1.50 మాత్రమే. దీనిని బైక్​గానూ, సైకిల్​గాను కూడా ఉపయోగించుకోవచ్చు.

కంప్యూటర్​ సైన్సులో డిగ్రీ పూర్తి చేసిన ధనుష్​.. చిన్నప్పటి నుంచి నవకల్పన అంటే ఆసక్తి అని తెలిపాడు. ఈ క్రమంలోనే ఈ సైకిల్​ను రూపొందించినట్లు పేర్కొన్నాడు.

ఈ సైకిల్​ను ధనుష్​ కొద్ది నెలల క్రితమే తయారు చేసినా.. ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో దీనికి ఆదరణ పెరుగుతోంది.

ఇదీ చదవండి : ప్రాంతీయ భాషల్లో బోధనతోనే నాణ్యమైన విద్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.