Madurai Collector Covid-19: దేశంలో ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో.. వారం రోజుల్లోగా కొవిడ్ టీకా తీసుకోకపోతే.. బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించేదని లేదని తమిళనాడులోని మధురై జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు కనీసం ఒక్కడోసు టీకా అయినా తీసుకోవాలన్నారు. ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యాక్సిన్ తీసుకోనివారికి.. బహిరంగ ప్రదేశాలైన హోటల్స్, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు.. తదితర వాణిజ్య సంస్థల్లోకి అనుమతి లేదని మధురై కలెక్టర్ అనీష్ శేఖర్ తెలిపారు.
Covid-19 Cases In Tamilnadu: తమిళనాడులో కొత్తగా 1,851 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారినుంచి కొత్తగా 1,911 మంది కోలుకున్నారు.
తమిళనాడులో ఇప్పటివరకు 25,90,632 కొవిడ్ కేసులు నమోదుకాగా.. 25,35,715 మంది కోలుకున్నారు. కరోనా మహమ్మారి ధాటికి రాష్ట్రంలో మొత్తం 34,547 మంది ప్రాణాలు కోల్పోయారు.
Karnataka Omicron: కర్ణాటకలో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువపత్రాన్ని చూపించినవారినే షాపింగ్మాల్స్లోకి అనుమతిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం బెంగళూరులో ఇద్దరికి ఒమిక్రాన్ వైరస్ నిర్ధరణ అయింది.
ఇదీ చూడండి: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు