ఇంటి నుంచి పారిపోయిన ఒక ప్రేమజంటను గ్రామస్థులు, కుటుంబసభ్యులు కలిసి ఘోరంగా శిక్షించారు. వారు పారిపోవడానికి సహకరించిన మరో అమ్మాయిని కొట్టారు. ఆ ముగ్గురి మెడలో టైర్లను పెట్టి డ్యాన్స్ (Eloping couple tires dance) కూడా చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ధార్ (Madhya Pradesh Dhar ki news) జిల్లాలో కొన్ని రోజుల క్రితం చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనపై ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా (Dhar news MP) కుండి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యంలేక ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 12న అదే గ్రామానికి చెందిన మరో యువతి సహకారంతో గుజరాత్‌కు పారిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు కుమార్తె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రేమజంట గుజరాత్ నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. తిరిగొచ్చిన వారిని గ్రామస్థులు, కుటుంబసభ్యులు దారుణంగా శిక్షించారు. ప్రేమజంటను వారికి సహకరించిన మరో యువతి మెడలో టైర్లు పెట్టి డ్యాన్స్ చేయించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై అడిషనల్ సూపరింటెండెంట్ దేవేంద్ర పాటిదర్ మాట్లాడుతూ.. "యువతి ఇంటి నుంచి పారిపోయినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. వీరికి సహకరించిన మరో అమ్మాయిపైనా కోపం పెంచుకున్నారు. దీంతో తిరిగొచ్చిన వారిద్దరితో సహా ఆ అమ్మాయిని కూడా శిక్షించారు" అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి: