మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన సాక్షి భరద్వాజ్ అనే మహిళ.. ఇంట్లోనే చిన్నపాటి అడవిని సృష్టించారు. 800 చదరపు అడుగుల పెరట్లో 4000 మొక్కలను పెంచుతున్నారు. ఇందులో 450 జాతులకు చెందిన మొక్కలు ఉన్నాయి. వీటిలో 150 రకాల మొక్కలు అత్యంత అరుదైనవని ఆమె చెప్పారు. అవి సాధారణ వాతావరణంలో పెరగవని, అందుకే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
మాన్సురోవర్ గ్లోబల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు సాక్షి. ఇంట్లో సృష్టించిన ఈ అడవికి 'జంగిల్వాస్' అని నామకరణం చేశారు.
'పట్టణాల్లోనూ చిన్నపాటి అడవులను సృష్టించవచ్చనే కాన్సెప్ట్‌తో దీన్ని నెలకొల్పాను. వీటిని మినీ జంగిల్స్, వర్టికల్ జంగిల్స్ అంటారు. స్మార్ట్ సిటీస్, అర్బనైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా మనం తక్కువ విస్తీర్ణంలోనే నివసించాల్సి వస్తోంది. ఉన్న చోటునే ఉపయోగించుకుని జంగిల్వాస్ను నెలకొల్పవచ్చు. అపార్ట్మెంట్లో ఉన్నా, డుప్లెక్స్లో ఉన్నా, హాస్టల్లో ఉన్నా.. ఇలాంటి మినీ అడవులను సృష్టించవచ్చు.'
-సాక్షి భరద్వాజ్.
జాతీయ రికార్డు..
జంగిల్వాస్ నెలకొల్పినందుకు సాక్షికి ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది.
ఇదీ చూడండి: రెండేళ్ల 'సూపర్ కిడ్'- ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు